Priyamani Divorce : భర్త ముస్తఫాతో విడాకులు తీసుకోబోతున్న ప్రియమణి.. అసలు కారణం ఇదే?!

Updated on: August 16, 2022

Priyamani Divorce : సామాన్య మధ్య తరగతి కుటుంబాల్లో పెళ్లి అన్నా విడాకులు తీసుకోవాలన్నా చాలా పెద్ద విషయం. కానీ సెలబ్రిటీలకు ఇప్పడు అది ట్రెండ్ లా మారిపోయింది. ఒకరిని చూసి ఒకరు ఆదర్శంగా తీసుకొని విడాకులు తీసుకుంటున్నారా అనే విషయం తెలియదు కానీ… ఈ మధ్య కాలంలో విడాకులు తీసుకోవడం అనేది చాలా మామూలు విషయం. అయితే తాజాగా అదే లిస్టులో చేరిపోయారు ప్రముఖ హీరోయిన్ ప్రియమణి. ఈమె మీద ముస్తఫా మొదటి భార్య ఆమెపై కేసు కూడా పెట్టింది. కానీ ప్రియమణి వాటిని ఏమాత్రం లెక్క చేయకుండా ముస్తఫాతో కాపురం చేస్తూ వచ్చింది.

priyamani-divorce-to-her-husband
priyamani-divorce-to-her-husband

ఇక్కడి వరకూ అంతా బాగానే ఉంది. కానీ వీళ్లిద్దరి మధ్య మనస్పర్థలు బాగా పెరిగిపోయాయని తెలుస్తోంది. అతి త్వరలోనే వీళ్లిద్దరూ విడాకులు తీసుకోవాలని భావిస్తున్నట్లు ఫిలిం నగర్ లో వార్తలు వినిపిస్తున్నాయి. అసలు విషయానికి వస్తే ప్రియమణి ఇప్పట్లో పిల్లల్ని కనే ఉద్దేశం లేదట. కెరియర్ లో తానూ అనుకున్న స్థాయిలో స్థిరపడే వరకు పిల్లల్ని కనకూడదని ఆమె అభిప్రాయం. కానీ ముస్తఫాకు అది నచ్చట్లేదు. ఆయనకి పిల్లలు కావాలని అంటున్నారట.

priyamani-divorce-to-her-husband
priyamani-divorce-to-her-husband

దీంతో వీరిద్దరి మధ్య మనస్పర్థలు వస్తున్నాయట. తరచూ గొడవలు కూడా జరుగుతున్నాయట. ఆ కారణం చేతే ఈ ఇద్దరు విడాకులు తీసుకోవాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ప్రియమణి ఇంకా కొన్నేళ్లు సినిమాలు, వెబ్ సిరీస్ లలో నటించాలని చూస్తున్నారట. మరి సోషల్ మీడియాలో వస్తున్న ఈ వార్తలపై అటు ప్రియమణి కానీ ముస్తఫా కానీ స్పందించలేదు.

Advertisement

Read Also : Comedian Sudhakar : సూపర్ స్టార్ కావాల్సిన సుధాకర్‌ను ఇండస్ట్రీలో ఎదగకుండా తొక్కేశారా..? అందుకే కమెడియన్‌గా మిగిలిపోయారా?

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel