Homeవార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

,

Petrol Prices Today : మళ్లీ బాదుడు.. పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు.. 14 రోజుల్లో 12సార్లు పెంపు..!

Petrol Prices Today : పెట్రోల్, డీజిల్ ధరలు మరోసారి పెరిగాయి. గత కొన్ని రోజులుగా పెరుగుతూనే ఉన్నాయి. ఈ రోజు పెట్రోల్, డీజిల్ లీటరుకు 40 పైసల చొప్పున పెంచుతూ చము

By Vinod Kumar

Published on: April 4, 2022 9:35 AM

Updated on: April 4, 2022 9:52 AM

Petrol Prices Today

---Advertisement---

Petrol Prices Today : పెట్రోల్, డీజిల్ ధరలు మరోసారి పెరిగాయి. గత కొన్ని రోజులుగా పెరుగుతూనే ఉన్నాయి. ఈ రోజు పెట్రోల్, డీజిల్ లీటరుకు 40 పైసల చొప్పున పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. గత 14 రోజుల్లో ఇంధన ధరలు పెరగడం ఇది 12వ సారి. మార్చి 22 నుండి ఏప్రిల్ 4 వరకు 14 రోజుల్లో 12 సార్లు ధరలను పెంచాయి సంస్థలు. 2 వారాల్లో టరు పెట్రోల్ పై రూ.8లకు పైగా పెంచాయి చమురు సంస్థలు.

తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.117.53గా ఉంది. ఇదే సమయంలో లీటర్ డీజిల్ ధర రూ.103.60గా ఉంది. కరీంనగర్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.117.71గా ఉండగా.. లీటర్ డీజిల్ ధర ధర రూ.103.81గా ఉంది. ఖమ్మంలో పెట్రోల్ ధర రూ. 118.03గా ఉండగా.. డీజిల్ ధర రూ.104.10గా ఉంది. మెదక్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.117.53గా ఉండగా.. డీజిల్ ధర రూ.104.06గా ఉంది.

Advertisement
Petrol Prices Today
Petrol Prices Today

ఆంధ్రప్రదేశ్‌లోని ప్రధాన నగరాలైన విజయవాడలో లీటర్ పెట్రోల్ రూ.118.55కు లభిస్తుండగా.. లీటర్ డీజిల్ ధర రూ.105.90లకు లభిస్తోంది. విశాఖపట్నంలో పెట్రోల్ ధర రూ.118.02ఉండగా.. డీజిల్ ధర రూ. 104.46గా ఉంది. విజయనగరంలో లీటర్ పెట్రోల్ ధర రూ.117.62లకు లభిస్తుండగా.. డీజిల్ ధర రూ.105.10గా ఉంది.

Read Also : 

, ,

Vinod Kumar

వినోద్ కుమార్. తెలుగు ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుఫాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2016లో జర్నలిజంలో అడుగుపెట్టారు. సినిమా, పాలిటిక్స్, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్, టెక్నాలజీ, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, హెల్త్ న్యూస్ కంటెంట్ రాస్తుంటారు.