వార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

,

Petrol Price : నేడు పెరగని పెట్రోల్ ధరలు.. ఇక ఆగినట్లేనా?

Petrol Price : గత పది రోజుల నుంచి దేశంలో ఇంధన ధరలు పెరుగుతూనే ఉన్నాయి. కేవలం పది రోజుల్లోనే 9 సార్లు పెరిగాయి. అయితే నిన్న దేశ రాజధాని దిల్లీలో పెట్రోల్​, డీజిల్​పై 80పైసల చొప్పున పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. దీంతో అక్కడ లీటర్ పెట్రోల్ ధర రూ.101.81కి చేరింది. డీజిల్​ ధర రూ.93.07కి పెరిగింది. అయితే ఈరోజు ఆ పెట్రోల్, డీజిల్ ధరలు పెరగకడపోవడం సామాన్య ప్రజలకు నిజంగా ఊరటనిచ్చే అంశమే. ... Read more

By Vinod Kumar

Published on: April 1, 2022 8:03 AM

Updated on: April 3, 2022 7:42 PM

---Advertisement---

Petrol Price : గత పది రోజుల నుంచి దేశంలో ఇంధన ధరలు పెరుగుతూనే ఉన్నాయి. కేవలం పది రోజుల్లోనే 9 సార్లు పెరిగాయి. అయితే నిన్న దేశ రాజధాని దిల్లీలో పెట్రోల్​, డీజిల్​పై 80పైసల చొప్పున పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. దీంతో అక్కడ లీటర్ పెట్రోల్ ధర రూ.101.81కి చేరింది. డీజిల్​ ధర రూ.93.07కి పెరిగింది. అయితే ఈరోజు ఆ పెట్రోల్, డీజిల్ ధరలు పెరగకడపోవడం సామాన్య ప్రజలకు నిజంగా ఊరటనిచ్చే అంశమే. అదే విధంగా చెన్నైలో లీటర్ పెట్రోల్ రూ. 107.45, డీజిల్ ధర రూ.97.52గా ఉన్నాయి. కోల్‌కతాలో లీటర్ పెట్రోల్ రూ.111.35, డీజిల్ రూ.96.22కి అందుబాటులో ఉన్నాయి.

తెలంగాణలోని హైదరాబాద్​లో నిన్న పెరిగిన ధరల అనంతరం లీటర్​ పెట్రోల్​ రూ.115.42, డీజిల్​ రూ.101.58గా ఉంది. నిన్నటితో పోలిస్తే ధరల్లో ఎలాంటి మార్పూ లేదు. ఆంధ్రప్రదేశ్​లో లీటర్ పెట్రోల్ ధర 87 పైసలు, డీజిల్ ధర 83 పైసలు పెరిగింది. ఫలితంగా గుంటూర్​లో లీటర్​ పెట్రోల్​ రూ.116.39 డీజిల్ రూ.102.20కి చేరింది. అలాగే విశాఖ పట్నంలో లీటర్ పెట్రోల్ ధర రూ.115.42, డీజిల్ రేటు రూ.101.27 వద్ద స్థిరంగా సాగుతోంది.

Read Also : Petrol Prices Today : మళ్లీ పెరిగిన పెట్రోల్ ధరలు.. హైదరాబాద్ లో ఎంతో తెలుసా?

, , , , , , ,

Vinod Kumar

వినోద్ కుమార్. తెలుగు ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుఫాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2016లో జర్నలిజంలో అడుగుపెట్టారు. సినిమా, పాలిటిక్స్, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్, టెక్నాలజీ, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, హెల్త్ న్యూస్ కంటెంట్ రాస్తుంటారు.

Join our WhatsApp Channel