Nuvvu Nenu Prema Serial : పద్మావతి నీతో మాట్లాడాలన్న విక్రమాధిత్య.. చేయి వదలండంటూ పద్మావతి ఫైర్.. అనూతో ఊహాల్లో అరవింద్..!

Nuvvu Nenu Prema Serial Aug 16 Today Episode : తెలుగు బుల్లితెరపై ప్రసారమౌతున్న నువ్వు నేను ప్రేమ సీరియల్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఇక నిన్నటి ఎపిసోడ్ లో భాగంగా కుంచల పద్మావతి, అను లపై అరుస్తుంది. ఇక ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరగబోతుంది ఇప్పుడు చూద్దాం. పద్మావతి షుగర్ లెస్ జ్యూస్ తీసుకుని విక్కీ కోసం వెళుతుంది. ఇక విక్కీకి జ్యూస్ ఇస్తుంది అప్పుడు విక్కీ నాకు షుగర్ ఉంది అని నీకెలా తెలుసు అంటాడు. ఒకసారి మీరు మాయ మేడంతో చెప్తుంటే విన్నాను అంటుంది. ఇక పద్మావతి అక్కడ నుండి వెళ్ళిపోతుంటే ఒకసారి ఆగు నీతో మాట్లాడాలి అంటాడు. అప్పుడు పద్మావతి నేను మీతో మాట్లాడను మీరేమంటారు నాకు తెలుసు నేనిప్పుడు మీ ఎంప్లాయి ని కాదు నేను ఇక్కడికి క్యాటరింగ్ చేయడానికి వచ్చాను అని చెప్పి అక్కడి నుండి వెళ్ళి పోతుంటే విక్కీ పద్మావతి చేయి గట్టిగా పట్టుకున్నాడు. అప్పుడు పద్మావతి నా చేయి వదలండి అంటుంది.

Nuvvu Nenu Prema Serial Aug 16 Today Episode _ Vikramaditya tries to talk to Padmavathi
Nuvvu Nenu Prema Serial Aug 16 Today Episode _ Vikramaditya tries to talk to Padmavathi

అప్పుడు విక్కీ నేను వదలను నేను నీతో మాట్లాడాలి అని చెప్పానుగా ఒకసారి నా మాట విను నీకేమైనా పొగరా అంటాడు. అప్పుడు పద్మావతి అది ఎవరికో తెలుస్తూనే ఉంది అంటుంది. అప్పుడు మాయ అక్కడికి వచ్చి విక్కీ అని పిలుస్తుంది. అప్పుడు విక్కీ మాయ ని చూసి పద్మావతి చేయి వదులుతాడు. ఇక పద్మావతి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. అప్పుడు మాయ ఏమైంది విక్కీ ఆ పద్మావతి నిన్ను ఏమైనా ఇరిటేట్ చేసిందా అంటుంది. ఇక కింద అందరూ మన కోసం ఎదురు చూస్తున్నారు పద అని చెప్పి విక్కీ నీ అక్కడి నుండి తీసుకెళుతుంది. ఇక మాయ అరవింద మరియు కృష్ణ నీ డాన్స్ చేయమని కోరుతుంది. ఇక విక్కీ కూడా డాన్స్ చేయమని అడుగుతాడు. ఇక అక్కడ ఉన్న వాళ్లంతా డాన్స్ చేయమని బలవంతం చేస్తారు. ఇక అరవింద మరియు కృష్ణ డాన్స్ చేయడానికి ఒప్పుకుంటారు.

Nuvvu Nenu Prema Serial Aug 16 Today Episode : పద్మావతిని తలుచుకుంటూ అరవిందకి ప్రపోజ్ చేసిన మురళి..

ఇక పద్మావతి, అను చూడడానికి అక్కడికి వెళ్తుంటే కుంచల వచ్చి వాళ్ళని ఆపుతుంది. మీరు ఎక్కడికి వెళ్తున్నారు అనగానే పద్మావతి డిజె దగ్గరికి వెళ్తున్నాము అని చెప్తుంది. అప్పుడు కుంచల మీకు అక్కడ ఏం పని మీ పని మీరు చూసుకోండి అయినా కేక్ రెడీ చేసారా అంటుంది. అప్పుడు పద్మావతి అది మా పని కాదు కదా అంటుంది. కుంచల చెప్పినట్టు వినకపోతే మిమ్మల్ని ఇక్కడ నుండి పంపిస్తాను. మేము ఫైవ్ స్టార్ హోటల్ నుండి ఆర్డర్ తేప్పిస్తాము అని బెదిరిస్తుంది.

Advertisement
Nuvvu Nenu Prema Serial Aug 16 Today Episode _ Vikramaditya tries to talk to Padmavathi
Nuvvu Nenu Prema Serial Aug 16 Today Episode

ఇక అను ఓకే మేడం మీరు చెప్పినట్టే చేస్తాను అంటుంది. ఇక కేక్ రెడీ చేయడానికి పద్మావతి మరియు అను అక్కడ నుండి వెళ్ళిపోతారు. ఇక విక్కీ బావగారు పార్టీ స్టార్ట్ చేసే ముందు మీరు మా అక్కకి ప్రపోజ్ చేయాలి అంటాడు. ఇక కృష్ణ పద్మావతిని తలుచుకుంటూ అరవిందకి ప్రపోజ్ చేస్తాడు. ఏడడుగులు మన బంధం ఏడు జన్మలు ఇలాగే ఉండాలి ఐ లవ్ యు రాణమ్మ అంటాడు. ఇక అరవింద కూడా మీలాంటి మంచి భర్త దొరికినందుకు నేను చాలా అదృష్టవంతురాలిని ఐ లవ్ యు టూ అంటుంది.

ఇక అరవింద మరియు కృష్ణ లు డాన్స్ చేస్తారు. ఇక ఆర్య కూడా తన స్వీట్ హార్ట్ కి ఇలాగే ప్రపోజ్ చేయాలి అనుకుంటాడు. తను ఇక్కడ ఉన్న బావుండేది అనుకుంటాడు. ఇక ఆర్య స్టేజి మీద అను ఉన్నట్టుగా ఊహించుకుని తనకి ప్రపోజ్ చేసి డాన్స్ చేస్తాడు. అప్పుడు వాళ్ళ నాన్న ఆర్య నీ ఏంట్రా ఏం ఆలోచిస్తున్నావ్ నాకు కోడలిగా ఓ లక్షణమైన అమ్మాయి రావాలి తను ఎలా ఉండాలి అంటే అను వైపు చూపించి తనలా ఉండాలి అని చెప్తాడు.

Nuvvu Nenu Prema Serial Aug 16 Today Episode _ Vikramaditya tries to talk to Padmavathi
Nuvvu Nenu Prema Serial Aug 16 Today Episode

అప్పుడు ఆర్య సంతోషపడుతూ తనలా కాదు నాన్న తననే తీసుకొస్తాను అని తన మనసులో అనుకుంటాడు. ఇక పద్మావతి అను తో అక్క వచ్చిన గెస్ట్ ల ముందు మనం విక్రమాదిత్య గురించి బుర్రకథ చెప్తే ఎలా ఉంటుంది అంటుంది. అప్పుడు అను అది జరగని పని అమ్మి అంటుంది. అప్పుడు పద్మావతి ఊహించుకోవడం లో తప్పు లేదు కదా అని చెప్పి విక్రమాదిత్య గురించి బుర్రకథ చెప్తున్నట్టుగా ఊహించుకుంటుంది. ఇక రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి.

Advertisement

Read Also : Nuvvu Nenu Prema Serial : అను, పద్మావతిని మురళికి పరిచయం చేయబోతున్న అరవింద.. మురళి అరవింద భర్త అనే నిజం పద్మావతికి తెలుస్తుందా?

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel