Site icon Latest Telugu News | తెలుగు వార్తలు – Tufan9.com

Jr NTR Political Entry : బాబు కన్నీళ్లు తుడిచేందుకు.. రాజకీయాల్లోకి యంగ్ టైగర్ NTR..?

Jr NTR Political Entry chandrababu

Jr NTR Political Entry chandrababu

Jr NTR Political Entry : యంగ్ టైగర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాలని ఆయన అభిమానులు ఎప్పటి నుంచో కోరుతున్నారు. 2014 ఎన్నికల టైంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ తరఫున ప్రచారం చేయడంతో ఆ పార్టీకి మంచి మైలేజ్ వచ్చింది. దీంతో వందకు పైగా స్థానాల్లో టీడీపీ పార్టీ విజయం సాధించగా ముఖ్యమంత్రిగా చంద్రబాబు  ప్రమాణ స్వీకారం చేశారు. తెలంగాణ, ఏపీ రెండు రాష్ట్రాలుగా ఏర్పాటవ్వడం.. ఏపీని అభివృద్ధి చేస్తాడనే ఉద్దేశ్యంతోనే బాబుకు ఓట్లు వేసినట్టు ప్రజలు చెప్పుకొచ్చారు.

అయితే, ఏపీ ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చడంలో టీడీపీ పార్టీ పూర్తిగా విఫలమైంది. దీంతో 2019 ఎన్నికల్లో ఏపీ ప్రజలు వైసీపీ పార్టీకి విజయం కట్టబెట్టి టీడీపీని చిత్తుగా ఓడించారు.  అంతవరకు బాగానే ఉన్నా చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో తన తండ్రి హరికృష్ణకు తగిన ప్రాధాన్యం ఇవ్వలేదని ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ చాలా బాధపడ్డారని తెలిసింది. హరికృష్ణ మరణాంతరం టీడీపీకి మొత్తానికే దూరం అవ్వాలని భావించినట్టు కూడా జోరుగా వార్తలొచ్చాయి. కానీ తన తాత సీనియర్ ఎన్టీఆర్ ఆశయం గుర్తొచ్చి ఆగిపోయినట్టు కూడా టాక్ వినిపించింది.

Rohini Bazaar Deoghar : ఇదో పురాతన షాపింగ్ మాల్.. ఇక్కడ బట్టల ధర రూ. 30, కూరగాయల సంచి రూ. 100.. అన్నీ చౌకగానే..!

ఇక మొన్న జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో చంద్రబాబు ఫ్యామిలీని ముఖ్యంగా తన మేనత్తను వైసీపీ నేతలు దూషించడంపై జూనియర్ ఎన్టీఆర్ కూడా స్పందించారు. హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ, మాజీ కేంద్రమంత్రి పురంధరేశ్వరి కూడా తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. తాజాగా ఎన్టీఆర్ స్పందనపై వర్ల రామయ్య హాట్ కామెంట్స్ చేశారు.తన మేనత్తను అన్ని మాటలు అంటే, మాజీ సీఎం కంటతడి పెట్టుకుంటే జూనియర్ ఎన్టీఆర్ ఈ విధంగా స్పందిస్తాడా అంటూ ఫైర్ అయ్యారు. కోడాలి నాని, వల్లభనేని వంశీ యంగ్ టైగర్ మిత్రులు కావడంతోనే వారిని ఏమీ అనలేదని వర్ల రామయ్య విమర్శించారు.

Advertisement

లేదంటే మేనత్తను అంతలా దూషిస్తే ఏదో సంఘీభావం ప్రకటించినట్టు ఆ మాట్లాడటం ఏంటని ప్రశ్నించారు. సొంత టీడీపీ నేతలు జూనియర్‌ను విమర్శించే స్థాయికి వచ్చారంటే ఆయన తప్పకుండా రాజకీయాల్లోకి వచ్చి బాబుకు, తన మేనత్తకు జరిగిన అవమానానికి ప్రతీకారం తీర్చుకోవాలని తెలుగు తమ్ముళ్లు కోరుతున్నారు. కాగా, వర్ల రామయ్య కామెంట్స్ పై యంగ్ టైగర్ ఏ విధంగా స్పందిస్తాడో వేచిచూడాల్సిందే.

IND vs SA 1st T20I : హార్దిక్ పాండ్యా సిక్సర్లతో సెంచరీ.. కేఎల్ రాహుల్ రికార్డు బ్రేక్.. టాప్ 5లో ఎవరంటే?

Read Also : YS Jagan : జగన్‌కు ఎందుకు ఇన్ని యూటర్నులు..? మొన్న మూడు రాజధానులు.. నిన్న మండలి..!

Advertisement
e-NAM App : రైతులకు శుభవార్త.. ఇకపై మీ పంటలను ఇంట్లో కూర్చొని గిట్టుబాటు ధరకే అమ్ముకోవచ్చు.. ఈ ప్రభుత్వ యాప్ ఎలా వాడాలో తెలుసా?
Exit mobile version