IPL 2022: ఐపీఎల్ 2022 లో మెరిసిన అందాల ఏసీపీ.. కుర్రకారు మనసు దోచుకున్న ముద్దుగుమ్మ.. ఫోటో వైరల్!

IPL 2022: ప్రస్తుతం ఐపీఎల్ టోర్నమెంట్ ఎంతో రసవత్తరంగా సాగుతుంది. ఈ క్రమంలోనే ఎంతోమంది కుర్రకారులు క్రికెట్ కి అంకిత మవుతున్నారు. అయితే ఒకప్పుడు ఐపీఎల్ అంటేనే సిక్స్ లు, ఫోర్లవర్షం కురిసేది. అయితే ప్రస్తుతం సిక్స్ లు ఫోర్ లతో పాటు అందమైన అమ్మాయిలు కూడా కీలకంగా మారుతున్నారు. ఆట ప్లస్ గ్లామర్ కలిస్తేనే ఐపీఎల్ అని చెప్పవచ్చు.అయితే ఈ మధ్యకాలంలో ఐపీఎల్ చూడటానికి వచ్చిన అమ్మాయిలు రాత్రికి రాత్రే బాగా ఫేమస్ అవుతున్నారు. ఈ ధనాధన్ లీగ్ లో అందమైన అమ్మాయిలు కెమెరా కంటపడి కుర్రకారుల మనసు కొల్లగొడుతున్నారు.

ఇప్పటికే దీపికా ఘోష్, కావ్య మారన్ లు మిస్టరీ గర్ల్ ట్యాగ్ తోనే సూపర్ స్టార్స్ అయ్యారు. ఈ క్రమంలోనే ఈ సీజన్లో కూడా మరో మిస్టరీ గర్ల్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే మంగళవారం బెంగళూరులో జరిగిన చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ చాలెంజర్స్ మ్యాచ్ లో ఓ అందాల తార తళుక్కుమంది. మంగళవారం ఈ మ్యాచ్ కవర్ చేస్తున్న కెమెరా కంటిలో ఈ ముద్దుగుమ్మ పడటంతో ఈ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అందాల తార ఎవరు ఏంటి అనే విషయం గురించి సెర్చ్ చేయడంతో షాకింగ్ విషయం బయటపడింది.

హిందీలో దేవ్ మనుష్య్ అనే సీరియల్ కు ఎంతో పాపులారిటీ దక్కింది. ఈ సీరియల్ లో ఏసిపి దివ్య పాత్రకు ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకుంది.నటి నేహాఖాన్ దేవ్ మనుష్య్ మొదటి భాగంలో ఏసీపీ దివ్య పాత్రను పోషించింది. రెండవ పార్ట్ లో బాగంగా నేహా ఖాన్ ఇంకా క‌నిపించ‌లేదు. ఇలా ఈమె ఈ సీరియల్ లోకనిపించకపోవడంతో అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ ముద్దుగుమ్మ ఐపీఎల్ మ్యాచ్ చూస్తూ ఎంజాయ్ చేస్తోంది. అయితే తను ఏ జట్టుకు సపోర్ట్ చేస్తుంది అనే విషయం తెలియాల్సి ఉంది.

Advertisement

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel