Karthika Deepam Oct 29 Today Episode : అడ్డంగా దొరికిపోయిన వాణి.. మోనిత వాణిలకు వార్నింగ్ ఇచ్చిన దుర్గ..?

Karthika Deepam Oct 29 Today Episode : తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో మోనిత, వాణి ఇద్దరు కలిసి దుర్గ,దీపలను చంపడానికి ప్లాన్ వేస్తారు.

ఈరోజు ఎపిసోడ్ లో మోనిత కు వాణి జరిగిన విషయాలు అన్నీ వివరిస్తూ ఉంటుంది. దాంతో షాక్ అయిన మోనిత వాళ్ళు ఎట్టి పరిస్థితులలో పాపను కలవకూడదు. వాళ్ళు ఆ పాపను కలిశారు అంటే ముగిసిపోయింది అనుకున్న వారి జీవితం మొదలవుతుంది నా జీవితం ఇక్కడితో ముగిసిపోతుంది ఎట్టి పరిస్థితులలో వెళ్ళకూడదు అని చెబుతుంది.

Durga catches Vani while trying to kill Deepa in todays karthika deepam serial episode
Durga catches Vani while trying to kill Deepa in todays karthika deepam serial episode

అప్పుడు మోనిత తాను కార్తీక్ ని ప్రేమించిన విషయం మొత్తం అంతా కూడా వాళ్లే వాణి తో చెబుతుంది. నేను అనుకున్నది జరగాలి అంటే రేపు సూర్యోదయం చూడకముందే వాళ్ళు దేవుడి దగ్గరికి వెళ్ళాలి అని అనడంతో సరే మేడం మీరు డబ్బులు రెడీగా పెట్టుకోండి అని చెప్పి వెళ్ళిపోతుంది వాణి. మరొకవైపు దీప పిండి వంటలు చేస్తూ ఉండగా కార్తీక్ వచ్చి దీపం చూసి సంతోష పడుతూ ఉంటాడు. ఇదంతా సౌర్య కోసమేనా అని అనగా అవును డాక్టర్ బాబు అంటూ సంతోషంగా మాట్లాడుతుంది దీప.

Advertisement

నువ్వు సౌర్యను చూడాలని ఎంత ఆరాటపడుతున్నావో నాకు అర్థం అవుతుంది దీప నాకు కూడా పాపను ఎలా ఉంటుందో చూడాలని ఉంది అని అంటాడు కార్తీక్. ఇంతలోనే వాణి అక్కడికి వచ్చి వారి మాటలు వింటూ ఉంటుంది. ఎక్కడికి వెళ్తున్నారు అన్నయ్య అని అనగా రేపు దీప వాళ్ళ కూతురిని చూడడానికి వెళ్తున్నాం అని అంటాడు కార్తీక్. అప్పుడు వాణి తన మనసులో ముందు మీరు బతికి ఉండాలి కదా అని అనుకుంటూ ఉంటుంది.

Karthika Deepam : శౌర్య దగ్గరికి వెళ్లిన దీప,కార్తీక్..

మరొకవైపు మోనిత ఒంటరిగా కూర్చొని కార్తీక్ ఎందుకు ఈ విధంగా ప్రవర్తిస్తున్నాడు. నన్ను పదేపదే అనుమానిస్తున్నాడు. ఇంతకుముందు నేను ఏం చెప్పినా నమ్మేవాడు కానీ ప్రతి దానికి అనుమానిస్తున్నాడు. ఒకవేళ కార్తీక్ గతం గుర్తుకు వచ్చి ఉంటుందా అంటూ తెగ టెన్షన్ పడుతూ ఉంటుంది మోనిత. మరొకవైపు దీప పడుకుని ఉండడం చూసి వాని ఇంటి మీదకు పెట్రోల్ పోసి తగలబెడదాము అని అగ్గిపుల్ల విశాల్ గా అగ్గిపుల్ల ఆరిపోతుంది.

దాంతో ఏమైందా అని అనుకుంటూ ఉండగా దుర్గ అక్కడికి వచ్చి అవి పెట్టాడు కాదే నీళ్లు అని అనడంతో వాణి షాక్ అవుతుంది. నువ్వు ఆ మోనిత పార్టీ అని నువ్వు ఒక పెద్ద దేశముదురు అని నాకు ముందే అర్థమయింది అందుకే నేను ఒక గంట కనిపెట్టాను. అప్పుడు వాణి అవును నేను దీప చంపడానికి వచ్చాను నిన్ను కూడా చంపమని చెప్పింది అని అనటంతో అవునా అంటూ వాణి చున్ని పట్టుకుంటాడు దుర్గ అప్పుడు వానికి తగిన విధంగా బుద్ధి చెప్పాలి అని అనుకుంటాడు.

Advertisement

మరుసటి రోజు ఉదయం మోనిత కంగారుగా నిద్ర లేస్తుంది. దీప ఇంటి వైపు చూడగా దీప హాయిగా కల్లాపు చల్లుతూ ఉండడంతో వాణి ఏం చేసింది అని వానికి ఫోన్ చేద్దామని ఫోన్ చూస్తూ ఉండగా ఫోన్ లాక్కుంటాడు దుర్గ. అప్పుడు జరిగిన విషయం అంతా చెప్పి మోనిత కు గట్టిగా వార్నింగ్ ఇస్తాడు దుర్గ. అసలు విషయం తెలుసుకుని మోనిత కూడా షాక్ అవుతుంది. ఆ వాణి ఇంక రాదు.

Karthika Deepam Oct 29 Today Episode
Karthika Deepam Oct 29 Today Episode

నిన్న రాత్రి నాకు అడ్డంగా దొరికిపోయింది దానికి కాలు చేయి విరిచి కావేరి ఇంటికి పార్సల్ చేశాను అనటంతో మోనిత షాక్ అవుతుంది. అప్పుడు వారిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా ఇంతలోనే అక్కడికి కార్తీక్ వస్తాడు. అప్పుడు కార్తీక్ ఏం మాట్లాడుకుంటున్నారు అని అనగా మోనిత టెన్షన్ పడుతూ ఉంటుంది. మీ మధ్యలో నేను ఒక్కడు ఉన్నారన్న విషయాన్ని మీకు తెలుస ఎప్పుడు నన్ను బకరా చేద్దామని మాట్లాడుకుంటున్నారా అనటంతో మోనిత కోపంగా అరుస్తుంది.

ఆ తర్వాత కార్తీక్ అక్కడి నుంచి వెళ్లిపోవడంతో జాగ్రత్త బంగారు అని చెప్పి దుర్గ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మరొకవైపు దీప శౌర్య దగ్గరికి వెళ్లడానికి రెడీ అవుతూ ఉంటుంది. దీంతో అక్కడికి వచ్చిన కార్తీక్ దీప వైపు అలాగే చూస్తూ ఉంటాడు. అవును వాణి కనిపించడం లేదు ఎక్కడికి వెళ్ళింది అని అనటంతో నాకు కూడా కనిపించలేదు డాక్టర్ బాబు అని అంటుంది దీప. ఆ తరువాత ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు.

Advertisement

Read Also : Karthika Deepam serial Oct 28 Today Episode : మోనితకు చుక్కలు చూపిస్తున్న కార్తీక్.. సంతోషంలో వంటలక్క..?

Ramesh Babu

Senior Content Editor

రమేష్ బాబు. జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుపాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ కంటెంట్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2017లో సబ్ ఎడిటర్‌గా జర్నలిజంలోకి వచ్చారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ వార్తలు, జనరల్ న్యూస్, సినిమా, టెక్నాలజీ, బిజినెస్ ఆల్ టైప్ కంటెంట్ రాస్తుంటారు.

Articles published under this author profile are written and reviewed by the Tufan9 Telugu News editorial team following strict editorial guidelines.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now
Join our WhatsApp Channel