Viral video : శునకం విశ్వాసానికి మారు పేరనే విషయం అందరికీ తెలిసిందే. దాదాపు వదంలో 60 ఇళ్లల్లో కుక్కలను పెంచుకుంటూ ఉంటారు. కుక్కపిల్లలను పెంచుకోవడం అంటే చాలా మందికి ఇష్టం. వీటిని ఇంట్లో సభ్యుల లాగానే చూస్కుంటూ తెగ మురిసిపోతుంటారు. వాటిపై ఎంతో ప్రేమను, అనుబంధాన్ని చూపిస్తుంటారు. వాటికోసం ఏదైనా చేయడానికి రెడీగా ఉంటారు.

అలాంటి ఓ వ్యక్తే ఓ కుక్కను పెంచుకుంటున్నాడు. అ.యితే ఆ కుక్క ఇంటి సభ్యులు చేసినట్లుగానే చేయడం.. వారి తిన్నప్పుడే తినడం వంటివి చేస్తుంటుంది. చాలా బుద్ధిగా ఉంటుంది. అందరితో కలిసి అది కూడా రోజూ టీవీ చూస్తుంది. ఈ క్రమంలోనే ఈ కుక్క టీవీ చూస్తోంది. అందులో వ్యాయామం చేస్తున్న వీడియో ప్లే అవగానే.. అది కూడా ఎక్సర్ సైజ్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
How to stay fit: a doberman recreates his workout by watching television. pic.twitter.com/T0nKyr7tSU
— Gabriele Corno (@Gabriele_Corno) August 23, 2022
దీన్ని చూసిన నెటిజెన్లు ఒక్కొక్కరూ ఒక్కోలా స్పందిస్తున్నారు. కొన్ని సార్లు నిలబడి, మరికొన్ని సార్లు పడుకొని వ్యాయామం చేస్తోంది. కుక్కలను కేవలం విశ్వాసం గల జంతువులు మాత్రమే కాదని.. తెలివైన జంతువుని తెలుస్తోంది. మీరూ కూడా ఓసారి ఈ వీడియోపై లుక్కేయండి.













