Homeవార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

, ,

Devatha: ఆదిత్యను నిలదీసిన సత్య.. బాధతో కుమిలి పోతున్న రాధ..?

Devatha: తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న దేవత సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో రాధ,మాధవ పై కోప్పడుతుంది. ఈరోజు ఎపిసోడ్ లో రాధ, మాధవపై కోప్పడిన కూడా మాధవ మాత్రం అలాగే మాట్లాడతాడు. నువ్వు అనుకున్న విధంగానే నేను కూడా దేవిని ఆదిత్య దగ్గరికి పంపించాలి అనుకుంటున్నాను కదా అని అంటాడు. నామీద కారు ఎక్కించే ప్రయత్నం చేశావు. అలా ... Read more

By Ramesh Babu

Published on: August 10, 2022 7:49 AM

Updated on: August 10, 2022 7:49 AM

---Advertisement---

Devatha: తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న దేవత సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో రాధ,మాధవ పై కోప్పడుతుంది.

ఈరోజు ఎపిసోడ్ లో రాధ, మాధవపై కోప్పడిన కూడా మాధవ మాత్రం అలాగే మాట్లాడతాడు. నువ్వు అనుకున్న విధంగానే నేను కూడా దేవిని ఆదిత్య దగ్గరికి పంపించాలి అనుకుంటున్నాను కదా అని అంటాడు. నామీద కారు ఎక్కించే ప్రయత్నం చేశావు. అలా ఎలా చేశావు రాధ అని అనగా వెంటనే రాధ కారు ఎక్కించే ప్రయత్నం చేశాను ఎక్కించలేదు సంతోష పడండి ఈసారి ఏదైనా జరిగితే కారు మీదికి ఎక్కిస్తాను అని అంటుంది.

ఇప్పటికైనా నా పెనిమిటి ఆదిత్యనే అని అనగా మాధవ మాత్రం ఊరి జనాల దృష్టిలో మనం ఇద్దరం భార్యాభర్తలము అంటూ ఊరి జనాల అండ ఉంది అన్న విధంగా మాట్లాడి ఎక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక మాధవ మాటలకు రాధ కోపంతో రగిలిపోతూ కనిపిస్తుంది. మరొకవైపు దేవి ఒంటరిగా కూర్చుని మాధవతో గతంలో మాట్లాడిన మాటలు తలుచుకొని బాధపడుతూ ఉంటుంది. ఎలా అయినా తన తండ్రిని పట్టుకోవాలి అని అనుకుంటుంది దేవి.

మరొకవైపు సత్య మాధవ అన్న మాటలు తలుచుకొని బాధపడుతూ ఉంటుంది. ఆదిత్య కు దూరంగా ఉండాలి అని బయట పడుకోవడానికి వెళుతుంది. అప్పుడు ఆదిత్య ఎందుకు బయట పడుకుంటున్నావు అని అడగడంతో సత్య ఎమోషనల్ అవుతూ మాట్లాడుతుంది. నీ మనసులో నా స్థానం ఏంటి ఆదిత్య అని అడుగుతుంది.

అప్పుడు ఆదిత్య బయట పడుకోవద్దు అని అనగా ఈ విషయం నా మీద ప్రేమ ఉంది చెప్పలేదు ఇంట్లో వాళ్ళు అందరూ ఏమనుకుంటారో అన్న భయంతో అంటున్నావు కదా అంటూ ఎమోషనల్ అవుతుంది. అప్పుడు ఆదిత్య ఏం మాట్లాడకుండా దేవి ఈ ఇంటికి వచ్చే వరకు నీతో ఏమీ నేను మాట్లాడలేను సత్య అని మనసులో అనుకుంటాడు. మరోవైపు దేవీ తన తండ్రి గురించి ఆలోచిస్తూ ఉండగా ఇంతలోనే రాధ అక్కడికి రావడంతో తండ్రి గురించి ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తుంది దేవి.

కానీ రాధ ఏం చెప్పకుండా మౌనంగా ఉంటూ బాధపడుతుంది. దేవుడమ్మ కొత్త బట్టలు తెచ్చి అవి తన వారసులు రుక్మిణి బిడ్డకు అని అనటంతో ఇంతలో దేవుడమ్మ భర్త అక్కడికి వచ్చి మొదట సత్య గురించి ఆలోచించమని చెబుతాడు. సత్య బాధను చూడమని తన బాధను పట్టించుకోమని చెప్పడంతో దేవుడమ్మ ఆలోచనలో పడుతుంది.

, , , , ,

Ramesh Babu

రమేష్ బాబు. జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుపాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ కంటెంట్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2017లో సబ్ ఎడిటర్‌గా జర్నలిజంలోకి వచ్చారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ వార్తలు, జనరల్ న్యూస్, సినిమా, టెక్నాలజీ, బిజినెస్ ఆల్ టైప్ కంటెంట్ రాస్తుంటారు.