Bride Dance Viral : బుల్లెట్ బండి పెళ్లి కూతురు పాట ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు.. పెళ్లి ఊరేగింపులో వధువు వరుడిని చూస్తూ డాన్స్ చేయడం సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అయింది. ఇప్పుడా ఆ పాటకు పోటీగా మరో కొత్త పెళ్లి కూతురు డ్యాన్స్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పెళ్లి వేడుకలో వధువు పెళ్లికొడుకును చూస్తూ ఓ రేంజ్ లో డాన్స్ చేసేసింది.

ఈ డాన్స్ చూసి షాక్ అయిన పెళ్లికొడుకు నవ్వుతూనే ఉన్నాడు. వధువు డాన్స్ చేసి ఫిదా అయిన వరుడు అలానే చూస్తుండి పోయాడు. పెళ్లికూతురు డ్యాన్స్ చేస్తూ స్టేజ్‌పైకి వచ్చింది. వేదికపైకి వచ్చిన వధూవరులు కామ్ గా కనిపిస్తారు. వరుడు సైలెంట్ గా ఉన్నప్పటికీ వధువు మాత్రం పెళ్లి అలంకరణలోనే డాన్స్ చేస్తూ అందరిని ఔరా అనిపించింది. ఆ వధువు బాలీవుడ్ పాపులర్ సాంగ్ ‘రంగ్ చద్దా హై, రంగ్ చడేగా…’పాటకు డ్యాన్స్ చేసింది.
ఇప్పుడా ఆ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఎంతైనా తెలుగులో వైరల్ అయిన బుల్లెట్ బండి పెళ్లికూతురు పాటంత మజా లేదని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ఏది ఏమైనా పెళ్లికూతుళ్లు తమ పెళ్లిలో ఒక మదురమైన గుర్తు ఉండేందుకు ఇలా జాలీగా పెళ్లి వేడుకల్లో హుషారుగా స్టెపులేస్తూ అందరిని ఆశ్చర్యపరుస్తున్నారు. వైరల్ అవుతున్న వీడియో ఇదే..
View this post on Instagram
Advertisement
Read Also : Singer Sunitha : భర్తపై నెటిజన్ నెగిటివ్ కామెంట్స్.. దిమ్మతిరిగేలా కౌంటర్ ఇచ్చిన సింగర్ సునీత..!