Intinti Gruhalakshmi june 20 Today Episode : ఇల్లు వదిలి తులసి చెంతకు చేరిన అంకిత.. విషయం తెలిసి ఆవేశంతో ఊగి పోతున్న లాస్య నందు?

Updated on: June 20, 2022

Intinti Gruhalakshmi june 20 Today Episode : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ ప్రతిరోజు ప్రసారమౌతూ ఎంతో మంచి ఆదరణ సంపాదించుకుంది. ఇక నేటి ఎపిసోడ్ లో భాగంగా ఈ సీరియల్ లో ఏం జరుగుతుంది అనే విషయానికి వస్తే..అంకిత తల్లి గాయత్రి ఐ హేట్ యు అంకిత అని అనడంతో నాకు ప్రేమ లేని చోట ఉండాలని లేదు అంటూ లగేజ్ బ్యాగ్ పెట్టుకొని తులసి ఇంటికి వస్తుంది.ఈ విధంగా లగేజ్ బ్యాగ్ తో తులసి ఇంటిలోకి అడుగుపెట్టడంతో అది చూసిన పరంధామయ్య దివ్య ఒక్కసారిగా షాక్ అవుతారు. దివ్య గట్టిగా తులసిని పిలుస్తుంది. ఏం జరిగిందని తులసి బయటకు రాగా లగేజ్ బ్యాగ్ తో ఉన్నటువంటి అంకితను చూసి షాక్ అవుతుంది.

Intinti Gruhalakshmi june 20 Today Episode
Intinti Gruhalakshmi june 20 Today Episode

తులసి ఏదైతే జరగకూడదు అనుకుందో అదే జరగడంతో గతంలో అంకితను తన ఇంటికి రావద్దు అన్న మాటలను గుర్తు చేసుకోవడమే కాకుండా ఈ మాటకు బదులుగా అంకిత సమాధానం చెబుతూ అది నా ఇల్లు ఎవరి పర్మిషన్ లేకుండా నేను అక్కడికి వస్తాను అంటూ చెప్పిన మాటలను గుర్తు చేసుకుంటుంది.నువ్వు ఎలా వచ్చిన నా నిర్ణయం మారదు అంటూ తులసి సమాధానం చెప్పడంతో నాకు వేరే దారి లేదని అంకిత సమాధానం చెబుతుంది.

అంకిత ఒంటరిగా రావడంతో పరంధామయ్య మాట్లాడుతూ ఒంటరిగా వచ్చావ్ అభి రాలేదా అని ప్రశ్నిస్తాడు. దీంతో అంకిత తన బాధలను చెప్పుకుంటుంది. ఆస్తి తన పేరు పై ఆస్తి ఉన్నప్పటికీ ఆస్తి అనుభవించే స్వేచ్ఛ నాకు లేకుండా పోయింది అంటూ బాధపడుతుంది.ఈ విధంగా అంకిత బాధపడుతూ వుండగా తులసి అప్పటికి తనకు నచ్చ చెప్పి అక్కడి నుంచి పంపించే ప్రయత్నం చేస్తుంది.ఈ విధంగా తులసి అంకితను పంపించాలని చూస్తుండగా అంకిత తాను ఉంటే అక్కడ ఉంటాను లేదంటే ఆశ్రమంలోనే ఉంటాను కానీ తిరిగి తన మమ్మీ ఇంటికి వెళ్ళనని ఖరాఖండిగా చెప్పేస్తుంది.

Advertisement

అంకిత తీసుకున్న ఈ నిర్ణయంతో చేసేదేమీ లేక తనను లోపలికి పంపుతుంది. గదిలో ఒంటరిగ కూర్చున్న అంకిత అభి గురించి ఆలోచిస్తూ బాధపడుతుంది. మరో వైపు నందు ఇంటి ఓనర్ వచ్చి ఇంటి అద్దె చెల్లించాలని గొడవ చేస్తాడు.ఇల్లు అద్దె కట్టలేని పరిస్థితిలో ఉన్నప్పుడు ఇక్కడి నుంచి వెళ్లి పోవడం మంచిది అంటూ గొడవ చేయగా నందు తణుకు సర్దిచెప్పి కాస్త సమయం అడుగుతాడు. అదే సమయంలో లాస్య అక్కడికి వచ్చి నందుని రెచ్చగొడుతూ తిరిగి తులసి ప్రస్తావన తీసుకు వస్తుంది.

ఈ క్రమంలోనే నందు అభికి ఫోన్ చేసి అంకిత గురించి అడగగా అంకిత ఇంట్లో నుంచి వెళ్లిపోయి తులసి దగ్గరకు వెళ్లిందని తెలుసుకుంటాడు. అదే సమయంలోనే గాయత్రి ఫోన్ తీసుకొని తులసి అనుకున్నది అనుకున్నట్టుగా చేసింది. మనం వెళ్లి తనని నిలదీయాలి అంటూ మాట్లాడుతుంది. మరోవైపు అంకిత అభి తన స్వార్థం కోసం తనని దూరం పెడుతున్నాడు అంటూ కుమిలిపోతుంది. ఇంతటితో ఈ ఎపిసోడ్ పూర్తి కాగా వచ్చే ఎపిసోడ్ లో లాస్య నందు కోపంతో తులసి ఇంటి పైకి గొడవకు వస్తారు.
Read Also :  Intinti Gruhalashmi june 16 Today Episode : తులసి ఇంటికి వెళ్లి పోయిన అంకిత.. కోపంతో రగిలిపోతున్న అభి..?

 

Advertisement

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel