Thamannah : నిహారిక తప్పేం లేదంటూ.. పబ్ ఘటనపై తమన్నా సింహాద్రి స్పందన!

Updated on: April 6, 2022

Thamannah : హైదరాబాద్ బంజారాహిల్స్ రాడిసన్ హోటల్ లో నిర్వహిస్తున్న పబ్ పై పోలీసులు దాడి చేసిన ఘటన చర్చనీయాంశంగా మారింది. అర్ధరాత్రి సమయానికి మించి పబ్ ను నిర్వహించడం.. పోలీసుల దాడిలో డ్రగ్స్ దొరకడం… ఇందులో చాలా మంది ప్రముఖుల పిల్లలు ఉండడంతో స్టేట్ మొత్తం హాట్ టాపిక్ గా మారింది. అయితే ఇందులో ప్రముఖ గాయకుడు రాహుల్ సిప్లిగండ్, మెడా డాటర్ నిహారిక ఉన్నారంటూ అన్ని ఛానెళ్లలో న్యూస్ వచ్చింది. అయితే వీరిద్దరిపైనే ఎక్కువ మంది ఫోకస్ చేయడం తప్పంటూ ట్రాన్స్ జెండర్, బిగ్ బాస్ కంటెస్టెంట్ తమన్నా సింహాద్రి తెలిపింది.

నిహారిక తన స్నేహితురాలి పుట్టిన రోజు వేడుక కోసం మాత్రమే అక్కడకు వెళ్లిందని… అయినా పబ్ కు వెళ్లిన వారందరిదీ తప్పంటే ఎలా అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. పబ్ లో ఉన్న ఎవరో ఒకరు తప్పు చేస్తే.. అక్కడ ఉన్న వారందరినీ నిందించడం సరికాదని చెప్పారు. అయినా నిహారిక తప్పేం లేదని పోలీసులు చెప్పినా వినకుండా న్యూస్ ఛానెళ్ల వాళ్లు.. ఆమెను హైలెట్ చేయడం మంచి పద్దతి కాదంటూ వివరించింది. మెగా ఫ్యామినీ అభిమానులుగా నిహారికపై చేసే ట్రోల్స్ ని అడ్డుకుంటామని వివరించారు.

Read Also : Varun Tej: నిహారిక పబ్ వ్యవహారం… వరుణ్ మెడకు చుట్టుకొనుందా… ఆందోళన చెందుతున్న మెగాఫ్యామిలీ!

Advertisement

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel