Chanakya neethi: అలాంటి తల్లిదండ్రులు పిల్లలకు శత్రువులంట.. అందులో మీరున్నారేమో చూస్కోండి!

ఏ పిల్లలకు అయినా తల్లిదండ్రులే మొదటి గురువనే మాటను ఆచార్య చాణక్యుడు నమ్మాడు. తల్లిదండ్రులు ఇచ్చిన సంస్కారం వారి జీవితాంతం పిల్లతో పాటు సాగుతుంది. దీని ఆధారంగానే పిల్లలకు వ్యక్తిత్వం ఏర్పడుతుంది. అందువల్ల ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లల విద్య, విలువలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. మీ పిల్లలు సరైన మాగ్రంలో వెళ్తే… పిల్లలు తమ బాధ్యతలను, విధులను సక్రమంగా నిరివరితుమచడన్ కీకపమడీ.. తల్లిదండ్రులు గర్వ పడేలా చేస్తారు. అయితే ఒక్కోసారి తల్లిదండ్రులు చేసే కొన్ని తప్పులు పిల్లల భవిష్యత్తును పాడు చేస్తాయి. అటువంటి తల్లిదండ్రులే పిల్లలకు శత్రువులు అవుతారని ఆచార్య చాణక్యుడు భావించాడు.

తల్లిదండ్రులు తమ పిల్లలు ఎప్పుడూ సద్గుణ సంపన్నుల్లా పెంచాలని… వారిని సత్ప్రవర్తనతో నడిచేలా తీర్చిదిద్దాలని ఆచార్య చాణక్యుడు చెప్పారు. అలాంటి పిల్లలు కుటుంబం పేరును మరింత ప్రకాసింప జేస్తారు. మంచి విత్తనాలు నాటితే.. మంచి ఫలాలు కూడా వస్తాయి. పిల్లల మనసులో తప్పుడు ఆలోచనలు వచ్చేలా ఎప్పుడూ చేయొద్దు. మీ ఉద్దేశ్యం లేదా ఏదైనా కోరికను నెరవేర్చడానికి పిల్లలపై ఎలాంటి ఒత్తిడి చేయకూడదు. సత్ప్రయోజనాల కోసం అబద్ధాలు చెప్పడం నేర్పించ వద్దు. ఈ రోజు చెప్పే అబధ్ధం రేపటి వారి జీవింతంపై చాలా ప్రబావం చూపిస్తుంది. పిల్లలకు మంచి ప్రవర్తన అలవర్చాలి.
ఆచార్య చాణక్యుడు చాణక్య నీతి రెండవ అధ్యాయంలో పిల్లల విద్య గురించి రాశారు. పిల్లల చదువును సీరియస్ గా తీసుకోని తల్లిదండ్రులు, చదువుపై శ్రద్ధ పెట్టని తల్లిదండ్రులు బిడ్డకు శత్రువులాంటి వారు. నిరక్షరాస్యులైన పిల్లలు భవిష్యత్తులో నాగరిక సమాజంచే తృణీకరించబడతాడని చెప్పాడు. ఆచార్య చాణక్యుడు పిల్లలకు మితిమీరన ప్రేమ, ఆప్యాయత ఇవ్వకూడదని నమ్మాడు. ఇలా చేయడం వల్ల మొండిగా తయారు అవుతారు. అంతేకాదు అలాంటి పిల్లు తమ మనస్సుకు అనుగుణంగా ప్రతీది చేయడం అలవాటు చేసుకుంటారు. దాని వల్ల పిల్లలు తప్పు చేస్తే… తప్పని సరిగా దండించాలి. తద్వారా వారు తప్పు, ఒప్పుల మధ్య తేడాను అర్థం చేసుకోగల్గుతారు. దీంతో వారిలో మంచి లక్షణాలు వృద్ధి చెందుతాయి.

Advertisement

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel