G
Telugu News » Health News » men menstruation man finds out has ovaries and uterus he had been menstruating for 20 years
⚡ Health News, Latest, Trending

Men Menstruation : అతడు మగాడే.. కానీ, 20 ఏళ్లుగా పీరియ‌డ్స్‌.. స్కానింగ్‌లో గర్భాశయం.. షాకైన వైద్యులు..!

Men Menstruation, urinary problem, ovaries, uterus, menstruating for 20 years, చైనాలో వింతఘటన, పురుషుడికి గర్భాశయం, పురుషుడికి పిరియడ్స్, మూత్రవిసర్జన స‌మ‌స్య, telugu news

Tufan9 Telugu NewsAdd as preferredsource on Google

Men Menstruation : అతడు మగాడే.. ఎలాంటి ఆపరేషన్ చేయించుకోలేదు. 20ఏళ్లుగా పీరియడ్స్ వస్తున్నాయి. ఎందుకు అలా జరుగుతుందో అతడికి అర్థం కాలేదు. ఏదో మూత్రసమస్య అనుకున్నాడు. చిన్నతనం నుంచే ఈ సమస్య ఉంది. అతడితోపాటు ఆ సమస్య కూడా పెరిగిపోతూ వచ్చింది. మూత్రంలో రక్తం పడుతుంది. తీవ్రమైన కడుపునొప్పి వస్తుంది. యుక్త వయస్సు వచ్చాక ఈ సమస్య మరింత తీవ్రమైంది. ఎందుకు తనకు ఇలా జరుగుతుందో తెలియక ఒకరోజున వైద్యున్ని సంప్రించాడు. ఆ వైద్యుడు స్కానింగ్ చేయగానే షాకయ్యాడు.. ఏంటంటే.. అతడి కడుపులో గర్భాశయం ఉందని నిర్ధారించినట్టు తెలిపాడు. అందుకే అండాలు విడుదల అవుతున్నాయని.. నీకు ఆడవారి మాదిరిగా పీరియడ్స్ వస్తున్నాయని తెలిపాడు.

Man finds out has ovaries and uterus, he had been enstruating for 20 years

అతడు అతడేగానీ.. జీవశాస్త్రపరంగా అతడు ఆమె.. అని వైద్యులు తెలిపారు. ఈ వింతైన ఘటన నైరుతి చైనాలోని సిచువాన్ ప్రావిన్స్‌లో జరిగింది. ఒక వ్య‌క్తికి 20 ఏళ్లుగా మూత్రంలో ర‌క్తం పడుతోంది. అత‌డి వ‌య‌స్సు 33 ఏళ్లు… యుక్తవయస్సులో మూత్రవిసర్జన స‌మ‌స్య ఉంటే ఆపరేషన్ చేశారు. అప్పటి నుంచి అత‌డికి మూత్రంలో రక్తం పడుతుంది. పొత్తికడుపులో నొప్పి వస్తోంది.

Men Menstruation : అతడు పురుషుడే.. ఆమెలా నెలసరి వస్తోంది..!

క‌డుపునొప్పి ఐదు గంట‌ల‌ుగా వస్తుండటంతో భరించలేక వైద్యుని వద్దకు వెళ్లాడు. అతడ్ని పరీక్షించిన వైద్యులు అపెండిసైటిస్‌గా నిర్ధారించారు. ఆప‌రేష‌న్ చేశారు. కానీ, క‌డుపునొప్పి మాత్రం త‌గ్గ‌లేదు. వైద్యులు స్కానింగ్ తీయడంతో షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. అత‌డి కడుపులో గర్భాశయంతో పాటు అండాశయాలు ఉన్నాయని నిర్ధారించారు. మగ సెక్స్‌హార్మోన్లు ఆండ్రోజెన్ స్థాయిలు సగటు కన్నా తక్కువగా ఉన్నాయ‌ని వైద్యులు గుర్తించారు.

ఆడ‌ సెక్స్‌హార్మోన్లతో పాటు అండాశయ స్థాయిలు ఆరోగ్యకరమైన మహిళల్లో మాదిరిగానే ఉన్నాయని క‌నుగొన్నారు. మగ, ఆడ పునరుత్పత్తి అవయవాలతో ఇంటర్‌సెక్స్‌లో జన్మించినట్టు వైద్యులు నిర్ధారణకు వచ్చారు. అందుకే అతడి మూత్రంలో రక్తం, కడుపునొప్పి పీరియడ్స్ కారణంగానే వ‌చ్చింది అని నిర్ధారణకు వచ్చారు.  తనలో స్త్రీ పునరుత్పత్తి అవయవాలు ఉన్నాయని తెలిసి అతడు బాధపడుతున్నాడు. ఎలాగైనా అవయవాలను తొల‌గించుకోవాల‌ని నిర్ణయం తీసుకున్నాడు. స్పెషలిస్ట్ హాస్పిటల్‌లో శస్త్రచికిత్స ద్వారా అతడిలోని స్త్రీ పునరుత్పత్తి అవయాలను విజయవంతంగా తొలగించారు. ఇప్పుడు అతడు సాధారణ పురుషుడిలానే మారిపోయాడు.

Advertisement

Read Also : Upasana -Ram Charan : రామ్ చరణ్ ఉపాసనకు పిల్లలు లేకపోవడానికి కారణం అదేనా.. ఎందుకో క్లారిటీ ఇచ్చేశారు!

Vinod Kumar ✓

వినోద్ కుమార్. తెలుగు ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుఫాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2016లో జర్నలిజంలో అడుగుపెట్టారు. సినిమా, పాలిటిక్స్, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్, టెక్నాలజీ, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, హెల్త్ న్యూస్ కంటెంట్ రాస్తుంటారు.

గమనిక: ఈ ఆర్టికల్ అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా, అవసరమైన చోట ఏఐ సహాయంతో రూపొందించబడింది. తాజా అప్‌డేట్స్ కోసం మా వెబ్‌సైట్‌ను సందర్శించండి. ఏవైనా తప్పులు గమనిస్తే contact@tufan9.com కు తెలియజేయండి.

🏷Men Menstruationmenstruating for 20 yearsovariesurinary problemuterus
◉f➤𝕏
◉   WhatsApp ChannelJoin Now
➤   Telegram ChannelJoin Now

తాజా వార్తలు