Dark Elbows: మీ మోచేతులు నల్లగా ఉన్నాయా? ఈ సింపుల్ రెమిడితో తెల్లగా మెరిసిపోతాయి..!

Updated on: June 12, 2025

Dark Elbows : మీ మోచేతులు నల్లగా ఉన్నాయా? మీరు స్లీవ్‌లెస్ దుస్తులను ధరించాలంటే ఇబ్బందిగా ఉంటుందా? చాలామంది మోచేతుల నలుపును దాచుకోవడానికి ఫుడ్ హ్యాండ్స్ దుస్తులు ధరిస్తారు. మోచేతులు నల్లబడటానికి అతి పెద్ద కారణం చర్మంపై మృతకణాలు.

శుభ్రత లేకపోవడం వల్ల, మోచేతుల దగ్గర మృతకణాలు పేరుకుపోతాయి. దాంతో అక్కడ నలుపు రంగు కనిపిస్తుంది. మోచేతుల నల్లదనాన్ని తొలగించడానికి కొన్ని హోం రెమిడీలు అందుబాటులో ఉన్నాయి. ఈ 5 బ్యూటీ టిప్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

బంగాళాదుంప రసం : బంగాళాదుంప రసం మోచేతుల నల్లదనాన్ని తొలగించడంలో అద్భుతంగా సాయపడుతుంది. బంగాళాదుంపలో విటమిన్ C ఉంటుంది. మృత చర్మ కణాలను తొలగించడంలో సాయపడుతుంది. బంగాళాదుంప రసాన్ని మోచేయిపై రాసి 15-20 నిమిషాలు అలాగే ఉంచండి. ఆ తర్వాత గోరువెచ్చని నీటితో కడగాలి.

Advertisement

పసుపు, పెరుగు :
పసుపు, పెరుగు మిశ్రమం మోచేతులపై ఉన్న నల్లదనాన్ని తొలగిస్తుంది. పసుపులో కర్కుమిన్ ఉంటుంది. చనిపోయిన చర్మ కణాలను తొలగించడంలో సాయపడుతుంది. పెరుగులో లాక్టిక్ ఆమ్లం ఉంటుంది. చర్మాన్ని ప్రకాశవంతంగా ఉంచండంలో సాయపడతుంది. పసుపులో పెరుగు కలిపి మిశ్రమాన్ని తయారు చేసి మోచేయిపై రాయండి. 15-20 నిమిషాలు అలాగే ఉంచి, ఆపై గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోండి.

నిమ్మకాయ, చక్కెర :
నిమ్మకాయ, చక్కెర మిశ్రమం మోచేతులపై ఉన్న నల్లదనాన్ని తొలగిస్తుంది. నిమ్మకాయలో విటమిన్ C ఉంటుంది. చనిపోయిన చర్మ కణాలను తొలగించడంలో సాయపడుతుంది. అయితే, చక్కెరలో చర్మాన్ని మెరిసేలా చేసే ఎక్స్‌ఫోలియేటింగ్ గుణాలు ఉన్నాయి. నిమ్మరసంలో చక్కెర కలిపి మిశ్రమాన్ని తయారు చేసి మోచేయిపై రాయండి. 15-20 నిమిషాలు అలాగే ఉంచి, ఆపై గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోండి.

శనగపిండి, పెరుగు :
శనగపిండి, పెరుగు మిశ్రమం మోచేతులపై ఉన్న నల్లదనాన్ని తొలగిస్తుంది. శనగపిండిలో చర్మపు మృత కణాలను తొలగించే ఎక్స్‌ఫోలియేటింగ్ గుణాలు ఉన్నాయి. పెరుగులో లాక్టిక్ ఆమ్లం ఉంటుంది. చర్మాన్ని కాంతివంతం చేయడంలో సాయపడుతుంది. శనగపిండిని పెరుగుతో కలిపి మిశ్రమాన్ని తయారు చేసి మోచేయిపై రాయండి. 15-20 నిమిషాలు అలాగే ఉంచి, ఆపై గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోండి.

Advertisement

Read Also : Realme P3 Ultra 5G : రియల్‌‌మి P3 అల్ట్రా 5జీ ఫస్ట్ సేల్ మీకోసం.. ఏకంగా రూ.3వేలు తగ్గింపు.. ఆర్డర్ పెట్టుకోండి! 

బియ్యం పిండి :
బియ్యపు పిండి మోచేతుల నల్లదనాన్ని తొలగించడంలో అద్భుతంగా సాయపడుతుంది. బియ్యం పిండిలో మృత చర్మ కణాలను తొలగించే ఎక్స్‌ఫోలియేటింగ్ గుణాలు ఉన్నాయి. బియ్యపు పిండిని మోచేతులపై రాసి 15 నుంచి 20 నిమిషాలు అలాగే ఉంచండి. ఆ తర్వాత గోరువెచ్చని నీటితో కడగాలి.

Advertisement

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel