Site icon Latest Telugu News | తెలుగు వార్తలు – Tufan9.com

Ragi Java : రాగి జావ తాగితే ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో తెలుసా ..!

health-tips-about-drinking-ragi-malt-in-telugu

health-tips-about-drinking-ragi-malt-in-telugu

Ragi Java : దక్షిణ భారతదేశంలో రాగులు మన ఆహారంలో భాగం. చాలా కాలం నుంచి అత్యధికంగా వినియోగంలో ఉన్న తృణధాన్యాల ఆహారంలో రాగులు ఒకటి. ఆ తర్వాత కొన్ని రోజులు మరుగున పడిపోయాయి. అయితే కొంతమంది ఆరోగ్య నిపుణుల సూచనలతో మళ్లీ చాలా మంది చూపు వీటివైపు మళ్లింది. తక్కువ ధరలో, అందరికీ సులభంగా లభించే ఈ రాగులతో ఎన్నో అద్భుతగుణాలు దాగి ఉన్నాయి.

వీటిలో కాల్షియం, పొటాషియం, కార్పోహైడ్రేట్లు, ఫైబర్, కొవ్వు పదార్థాలు అధికంగా ఉన్నాయి. దీంతో పాటు బి విటమిన్లు, ఐరన్ లాంటివి సమృద్ధిగా ఉన్నాయి. రాగులు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయని వైద్య నిపుణులు తెలిపారు. రాగులను ఎలా తీసుకున్నా పలు రోగాలకు చెక్ పెట్టవచ్చని వెల్లడించారు. ప్రతి రోజూ రాగి జావ తాగితే శరీరానికి కలిగే ఆరోగ్య ప్రయోజనాలను ఇప్పుడు తెలుసుకుందాం.

ఉదయాన్నే రాగి జావ తాగితే చాలా మంచిది. రోగాలకు చెక్ పెట్టవచ్చని నిపుణులు చెబుతున్నారు. రాగులను ఉప్మా లాగా చేసుకోని తిన్నా… శరీరానికి అధిక బలం వస్తుంది. మొలకెత్తిన రాగులు తిన్నా చాలా బెటర్. ఇందులో అనేక పోషక విలువలు ఉంటాయి. ముఖ్యంగా శరీరానికి చేకూర్చే బలమైన పోషకాలన్నీ రాగులల్లో లభిస్తాయి.

Advertisement
health-tips-about-drinking-ragi-malt-in-telugu

Health Tips : రాగి జావ ఎప్పుడు తాగితే మంచిదంటే..? 

రాగుల్లో గ్లైసిమిక్‌ ఇండెక్స్‌ తక్కువగా ఉన్నాయి. కావున రాగులు మధుమేహ రోగులకు మంచి ఆహారం. రాగులలో రక్తంలోని కొలెస్ట్రాల్‌ను నియంత్రించి గుండెను రక్షిస్తాయని పేర్కొంటున్నారు. రక్త ప్రసరణ బాగా జరుగుతుంది.రాగుల్లో ఎక్కువగా పీచు పదార్ధాలు ఉన్నాయి. కావున వీటివల్ల జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉండటమే కాక, పేగులలో పుండ్లు, అతిసార, పెద్ద పేగు కాన్సర్‌ నుంచి రక్షణ లభిస్తుంది.

అలాగే ఇవి బరువును కూడా తగ్గిస్తాయి. రాగులు రోగ నిరోధక వ్యవస్థను బలోపేతం చేసి అంటు వ్యాధుల బారి నుంచి రక్షిస్తాయి. రక్తహీనత సమస్యను దూరం చేస్తాయి. నాడీ వ్యవస్థ పనితీరును పెంచుతాయి. ఎముకలు ధృఢంగా ఉంచడమే కాకుండా కండరాలకు బలం చేకూరుతుంది. కావున ఉదయాన్నే రాగి జావ తాగితే… ఈ సమస్యలన్నింటికీ చెక్ పెట్టవచ్చంటున్నారు నిపుణులు.

Read Also : Health Tips : వేసవి కాలంలో రాగి అంబలితో కలిగే అద్భుత ప్రయోజనాలు తెలిస్తే షాక్ అవుతారు..!

Advertisement
Exit mobile version