Okra Fenugreek Water : ఉదయం ఖాళీ కడుపుతో బెండకాయ, మెంతి నీరు తాగడం వల్ల ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఈ పానీయంలో ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు, పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. మీరు ఈ ఆరోగ్యకరమైన పానీయాన్ని ఇంట్లో సులభంగా తయారు చేసుకోవచ్చు.
జీర్ణక్రియను మెరుగుపరచడంలో రక్తంలో చక్కెరను నియంత్రించడంలో సాయపడతాయి. క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల బరువు తగ్గవచ్చు. శరీర రోగనిరోధక శక్తిని పెంచేందుకు సాయపడతుంది. ప్రతిరోజూ ఉదయం తాగడం వల్ల కలిగే ప్రయోజనాలేంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
Okra Fenugreek Water : రక్తంలో చక్కెర నియంత్రణ :
బెండకాయ, మెంతి గింజల నీరు రక్తంలో చక్కెరను నియంత్రించగలవు. రాత్రంతా నీటిలో నానబెట్టడం ద్వారా అందులోని ముఖ్యమైన పోషకాలు నీటిలో కలిసిపోతాయి. ఉదయం ఖాళీ కడుపుతో నీటిని తాగడం వల్ల ఇన్సులిన్ బాగా పనిచేస్తుంది.
చక్కెర పెరగకుండా నిరోధిస్తుంది. ముఖ్యంగా ప్రీ-డయాబెటిస్ లేదా ఇన్సులిన్ సంబంధిత సమస్యలు ఉన్నవారికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. డయాబెటిస్ రోగులకు ఇంటి చిట్కాగా పనిచేస్తుంది.
జీర్ణక్రియ మెరుగుపరుస్తుంది :
బెండకాయలో ఒక రకమైన జిగట జెల్ లాంటి పదార్థం ఉంటుంది. కడుపును చల్లబరుస్తుంది. విశ్రాంతినిస్తుంది. మెంతులు ఫైబర్ కలిగి ఉంటాయి. జీర్ణక్రియను మెరుగుపరచడంలో సాయపడుతుంది. ఈ రెండింటినీ రాత్రంతా నీటిలో నానబెట్టి ఉదయం తీసుకుంటే కడుపు శుభ్రంగా ఉంచి వాపును తగ్గించి పేగులను ఆరోగ్యంగా ఉంచడంలో ప్రయోజనకరంగా ఉంటుంది. శరీరం తేలికగా, తాజాగా ఉన్నట్లు అనిపిస్తుంది.
Okra Fenugreek Water : జుట్టు, చర్మానికి మంచిది :
బెండకాయ, మెంతులతో తయారుచేసిన నీరు చర్మం, జుట్టుకు మంచి ప్రయోజనకరంగా ఉంటుంది. ఇందులోని విటమిన్లు, ఇనుము, ముఖ్యమైన పోషకాలు చర్మానికి తేమను అందిస్తాయి. ప్రతిరోజూ తీసుకుంటే క్రమంగా జుట్టు రాలడం తగ్గుతుంది. చర్మం సహజమైన మెరుపును కూడా పొందవచ్చు.
బరువు తగ్గుదల :
ఉదయం ఖాళీ కడుపుతో బెండకాయ, మెంతి నీళ్లు తాగడం వల్ల బరువు వేగంగా తగ్గుతారు. ఉదయం తాగడం వల్ల కడుపు నిండినట్లు అనిపిస్తుంది. పదే పదే ఆకలి వేయదు. మెంతులు శరీరంలో కార్బోహైడ్రేట్లను నెమ్మదిగా జీర్ణం చేయడంలో సాయపడుతుంది. మీ ఆహారంలో చేర్చుకోవడం వల్ల బరువు నియంత్రణలో ఉంటుంది.
నొప్పి నివారణ :
బెండకాయ, మెంతులు రెండూ శరీరంలో మంటను తగ్గించడంలో సాయపడతాయి. ఈ రెండు నానబెట్టిన నీటిని ప్రతిరోజూ తీసుకుంటే కీళ్ల నొప్పులు, అలసట, జీవక్రియ సంబంధిత సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. తద్వారా శరీరం క్రమంగా లోపలి నుంచి ఆరోగ్యంగా మారుతుంది.
Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇలాంటి ఏ హోం రెమిడీ ఔషధమైనా తీసుకునే ముందు మీ వైద్యుడిని సంప్రదించండి. ఆ తర్వాతే సూచనలతో తీసుకోండి.