Samantha : క్షమించరాని తప్పులు చేసిన చైతూ.. సామ్ ఫ్యాషన్ డిజైనర్ సంచలన కామెంట్స్.. అందుకే విడిపోయారట!    

Updated on: August 4, 2025

Samantha Preetham Jukalker Comments : టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీలో సామ్ చై విడాకుల అంశంపై నేటికి ఇంకా చర్చ జరుగుతోంది. డివోర్స్ అనంతరం రోజుకో కొత్త విషయాలు వెలుగుచూస్తున్నాయి. తప్పు నీదంటే నీదని ఒకరిపైఒకరు నిందలు వేసుకుంటున్నట్టు తెలుస్తోంది. సామ్ చై పెళ్లయ్యాక  తెలుగు చిత్ర పరిశ్రమలోనే క్యూటెస్ట్ కపుల్‌గా పేరొందిన ఈ జంట కేవలం నాలుగేళ్లలోనే  విడిపోతారని ఎవరూ ఊహించలేదట. ఈ విషయం తెలియడంతో అభిమానులు, ఫిలిం ఇండస్ట్రీ ఒకింత నిరాశకు గురయ్యారని తెలిసింది.

క్యూటెస్ట్ కపుల్ విడిపోవడానికి కారణం చైతూనే : 
‘ఏ మాయ చేసావే’ సినిమాతో మొదలైన వీరి పరిచయం..  ‘మనం’ సినిమాతో ప్రేమగా మారి పెళ్లి వరకు వెళ్లినట్టు సమాచారం. చివరగా ‘మజిలీ’ మూవీ తర్వాత వీరిద్దరూ జంటగా స్క్రీన్ పై కనిపించలేదు. నాలుగేళ్లు హ్యాపీగానే సాగిన వీరి దాంపత్య జీవితం ఏమైందో తెలీదు కానీ ఒక్కసారిగా సామ్ సోషల్ మీడియాలో పెట్టిన పోస్టుతో వీరిమధ్య దూరం పెరిగిందని, త్వరలోనే విడిపోతున్నారని జోరుగా చర్చ జరిగింది. రోజురోజుకూ సామ్ చై విడాకుల గురించి పుకార్లు షికార్లు చేయడంతో చివరకు సామ్ చై ఇద్దరూ తాము విడిపోతున్నామని సోషల్ మీడియా వేదికగా అధికారికంగా ప్రకటించారు.
Ashwagandha : ఈ చూర్ణంతో ఎన్ని వ్యాధులైనా తోకమూడవాల్సిందే.. మూలికల్లో మొనగాడు అశ్వగంధ!

Samantha's Stylist Preetham Jukalker Sensational Comments on Naga Chaitanya
Samantha’s Stylist Preetham Jukalker Sensational Comments on Naga Chaitanya
సామ్ చై విడిపోవడానికి అసలు కారణం ఎవరంటే? :
అయితే, ఇన్నిరోజులు సామ్ చై జంట విడిపోవడానికి సమంతనే కారణమని, ఆమె చేసిన తప్పుల వల్లే వారిద్దరూ విడిపోయారని నెటిజన్లు భావించారు. దీంతో అదేపనిగా ఆమెపై విమర్శల వర్షం కురిపించారు.చివరకు సామ్ బాధపడుతూ పెట్టిన పోస్టుతో నెటిజన్లు పోస్టులు పెట్టడం మానేశారు. కాగా, సామ్ చై విడిపోవడానికి అసలు కారణం చైతూనే అని సామ్ ఫ్యాషన్ డిజైనర్ జూక్ ఆల్కేర్ (Preetham Jukalker) అనే వ్యక్తి తన సోషల్ మీడియా వేదికగా ప్రకటించాడు. అందులో చైతూను ఉద్దేశించి కొన్ని పోస్టులు పెట్టినట్టు తెలుస్తోంది. ఈ విషయం తెలిసి సామ్ పోస్టులు డిలీట్ చేయాలని చెప్పడంతో అతను వెంటనే వాటిని రీమూమ్ చేశాడట..

Advertisement
Samantha's Stylist Preetham Jukalker Sensational Comments on Naga Chaitanya
Samantha’s Stylist Preetham Jukalker Sensational Comments on Naga Chaitanya

 ఇకపై నాగ చైతన్య నీ సొంతం..
‘‘ఆ పోస్టుల్లో ఏముందంటే  (అబద్ధాలు, సీక్రెట్స్ అనేవి బంధాలను నాశనం చేస్తాయని.. నువ్వు ఎంత దాచినా సరే, ఎదో ఒకరోజు ఈ విషయం బయటపడుతుందని ఆ పోస్టులో పేర్కొన్నాడు. అంతే కాకుండా ‘స్లట్‌కు శుభాకాంక్షలు, ఇకపై నాగ చైతన్య (Naga Chaitanya) నీ సొంతం’ అంటూ స్టేటస్ పోస్టు పెట్టాడు. ఈ పోస్టులకు అర్థం..  అక్కినేని నాగచైతన్య వేరే అమ్మాయితో కొంతకాలంగా సీక్రెట్ రిలేషన్ షిప్ మెయింటెన్ చేస్తున్నాడని, ఈ విషయం తెలిసి సామ్ చైతూతో గొడవ పెట్టుకుని దూరం అయ్యిందని నెట్టింట జోరుగా చర్చ నడుస్తోంది.’’

సామ్ చై విడిపోవడానికి ముఖ్యంగా చైతూనే కారణమని, సామ్ ది ఏ తప్పు లేదని అతను చెప్పేందుకు ప్రయత్నించినట్టు అంతా భావిస్తున్నారు. ఏదేమైనా టాలీవుడ్ క్యూటెస్ట్ కపుల్ విడిపోవడానికి  చైతూ సీక్రెట్స్, అబద్ధాలే కారణమని సామ్ అభిమానులు అనుకుంటున్నారు. సామ్ చై విడిపోవడానికి అసలు కారణం ఏదైనా కావొచ్చు గానీ, సామ్ ఫ్యాషన్ డిజైనర్ జూక్ ఆల్కేర్ పోస్టులతో ఏదో జరిగి ఉంటుంది అనేది మాత్రం తెలుస్తోంది. చై-సామ్ విడిపోవడాన్ని అక్కినేని అభిమానులు మాత్రం జీర్ణించుకోలేకపోతున్నారు. వారిద్దరూ మళ్లీ కలిస్తే బాగుండూ అని అభిప్రాయపడుతున్నారు. వారిద్దరూ కలిసి కనిపిస్తే చూడాలని కోరుకుంటున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel