Site icon Latest Telugu News | తెలుగు వార్తలు – Tufan9.com

RRR SS Rajamouli : రాజమౌళి కాళ్లు మొక్కేందుకు ప్రయత్నించిన ఆలియా భట్.. జక్కన్న ఏం చేశాడంటే?

RRR SS Rajamouli : Actress Alia Bhatt Try to Take Blessings from SS Rajamouli

RRR SS Rajamouli : Actress Alia Bhatt Try to Take Blessings from SS Rajamouli

RRR SS Rajamouli : టాలీవుడ్ దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి తెరకెక్కించిన ప్రతిష్టాత్మక చిత్రం ‘ఆర్ఆర్ఆర్’ ట్రైలర్ విడుదలై ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో మూవీ యూనిట్ సభ్యులు యాక్టివ్‌గా పాల్గొంటున్నారు. వచ్చే ఏడాది జనవరి 7న సంక్రాంతి కానుకగా ఫిల్మ్ రిలీజ్ కానుంది. ట్రైలర్ రిలీజ్ తర్వాత మూవీ డైరెక్టర్ రాజమౌళి, యాక్టర్స్‌తో కలిసి ప్రమోషన్స్‌లో పాల్గొంటున్న క్రమంలో ఓ ఆసక్తికర సంఘటన జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో దూసుకుపోతున్నది. అదేమిటంటే..

ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో రాజమౌళి, ఆలియా భట్ పక్కపక్కనే కూర్చొన్నారు. ఈ క్రమంలోనే అలియా భట్ ఒకానొక టైంలో కాలు మీద కాలు వేసుకుని కూర్చునేందుకు ట్రై చేసింది. ఆ టైంలో పొరపాటున రాజమౌళికి అలియా భట్ కాళ్లు తగిలాయి. దాంతో వెంటనే ఆలియా భట్ రియాక్ట్ అయింది. ఎటువంటి గర్వం లేకుండా రాజమౌళి కాళ్లకు దండం పెట్టేందుకుగాను ప్రయత్నించింది.

అయితే, అందుకు రాజమౌళి వద్దు వద్దు అని చెప్తూ కాళ్లు మొక్కడాన్ని నివారించారు. ఇందుకు సంబంధించిన వీడియో రికార్డు కాగా, అది సోషల్ మీడియాలో బాగా వైరలవుతోంది. బీ టౌన్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్‌కు ఇంత సంస్కారం ఉండటం మంచి విషయమని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. రాజమౌళి సైతం కాళ్లు మొక్కేందుకు వస్తున్న ఆలియాను వారించి తన స్టేచర్‌ను ఇంకా పెంచేసుకున్నారని అంటున్నారు.

Advertisement

‘ఆర్ఆర్ఆర్’ పిక్చర్‌లో ఆలియా భట్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్‌కు జోడీగా నటించింది. సీత పాత్రలో ఆలియా కనిపించనుండగా, అల్లూరి సీతా రామ రాజు పాత్రలో చెర్రీ నటించారు. సినిమాలో రామ్ చరణ్ మూడు వేరియేషన్స్‌లో కనిపించబోతున్నారు. పోలీస్ ఆఫీసర్‌గా, అల్లూరి సీతా రామరాజు పాత్రలో, తారక్ అన్నగా.. మొత్తంగా మూడు పాత్రల్లో కనబడబోతున్నారని విడుదలైన ట్రైలర్ ద్వారా తెలుస్తోంది.

Read Also : Vijaya Devarakonda : విజయ్ దేవరకొండకు బాలీవుడ్ హీరోయిన్ ఫిదా.. రౌడీబాయ్‌తో అలా చేయాలంటూ హాట్ కామెంట్స్..!

Advertisement
Exit mobile version