G
Telugu News » Entertainment » rrr ott release date is out
Entertainment, Latest, Topstory

RRR OTT Release: ఆర్ఆర్ఆర్ ఓటీటీ రిలీజ్ అప్పటి నుంచే.. కానీ ఓ కండిషన్!

RRR OTT Release: యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌లు హీరోలుగా నటించిన తాజా చిత్రం ఆర్ఆర్ఆర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసం లేదు. దా

Tufan9 Telugu NewsAdd as preferredsource on Google

RRR OTT Release: యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌లు హీరోలుగా నటించిన తాజా చిత్రం ఆర్ఆర్ఆర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసం లేదు. దాదాపు వెయ్యి కోట్లకు పైగా వసూళ్లు సాధించిన ఈ సినిమాను… థియేటర్లలో చూసేందుకు జనాలు ఇప్పటికీ ఎగబడుతున్నారు. ఒక్కసారి కాదు.. ఒక్కొక్కరూ రెండు మూడు సార్లు చూస్తూ.. పండగ చేస్కుంటున్నారు. అంతే కాదండోయ్ ఓటీటీలో ఎప్పుడెప్పుడు వస్తుందా అని తెగ వేచి చూస్తున్నారు. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ చిత్రం మార్చి నెలాఖరులో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం అందరికీ తెలిసిందే.

Advertisement

అయితే ఈ క్రమంలోనేలో ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ ఓటీటీ రిలీజ్‌పై ఓ ఆసక్తికరమైన వార్త నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌ జీ5, నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా మే 20 నుంచి ఈ సినిమా అందుబాటులోకి రాబోతోందని తెలుస్తోంది. అంతే కాదు ఈ సినిమా చూడాలంటే ఓ కండీషన్ కూడా పెట్టినట్లు తెలుస్తోంది. అదేంటంటే… మే 20వ తేదీన ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చూడాలనుకుంటే సదరు స్ట్రీమింగ్‌ ప్లాట్‌ఫామ్‌కి సబ్‌స్క్రైబర్లు కొంత మొత్తంలో డబ్బు చెల్లించాలని వార్తలు వస్తున్నాయి. ఇక, జూన్‌ 3 నుంచి ఆయా స్ట్రీమింగ్‌ ప్లాట్‌పామ్స్‌లో ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ యూజర్లందరికీ అందుబాటులో ఉండనుందని సమాచారం.

Read Also : RGV Shocking comments: శివ సినిమా తీసిన ఆర్జీవీ ఎప్పుడో చనిపోయాడంట..!

Vinod Kumar

వినోద్ కుమార్. తెలుగు ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుఫాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2016లో జర్నలిజంలో అడుగుపెట్టారు. సినిమా, పాలిటిక్స్, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్, టెక్నాలజీ, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, హెల్త్ న్యూస్ కంటెంట్ రాస్తుంటారు.

🏷rrr movie in zee 5rrr ott movie in netflixRRR OTT Releaserrr ott release date
f𝕏
◉   WhatsApp ChannelJoin Now
➤   Telegram ChannelJoin Now

తాజా వార్తలు