Site icon Latest Telugu News | తెలుగు వార్తలు – Tufan9.com

RRR Full Journey : RRR జర్నీ… అలా మొదలై ఇలా ఎండ్‌ అయ్యింది.. పూర్తి వివరాలు ఇవే..!

RRR Full Journey : Full journey of RRR Movie Details, All you need to Know about this film

RRR Full Journey : Full journey of RRR Movie Details, All you need to Know about this film

RRR Full Journey : టాలీవుడ్‌ జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్‌ఆర్ఆర్ సినిమా మరి కొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. మార్చి 25వ తారీకు కోసం చాలా రోజులుగా తెలుగు సినిమా ప్రేమికులు ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా లో ఇద్దరు సూపర్ స్టార్‌ హీరోలు రామ్ చరణ్ మరియు ఎన్టీఆర్ లు కలిసి నటించడంతో అంచనాలు ఆకాశాన్ని తాకేలా వచ్చాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ సినిమా ఎప్పుడు షురూ అయ్యింది… ఎలా షురూ అయ్యింది.. చివరకు ఎలా ఎండ్‌ అయ్యింది అనే విషయాలను ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

ఈ సినిమాను 2018 మార్చి నెలలో సింపుల్‌ గా అనౌన్స్ చేశారు. 2018 నవంబర్‌ లో సినిమా ను అధికారికంగా పట్టాలెక్కిస్తున్నట్లుగా ప్రకటించారు. సినిమా కోసం మొదటి షాట్ ను ఇద్దరు హీరోలు కలిసి వస్తున్న ఒక భారీ యాక్షన్ సన్నివేశంగా తెరకెక్కించారు. ఈ సినిమా లో ఆలియా భట్ ను హీరోయిన్ గా అనుకున్న సమయంలో ఆమె వెంటనే ఓకే చెప్పింది. సినిమాకు సంబంధించిన విషయాలను షూటింగ్ ప్రారంభం అయిన సమయంలోనే వెళ్లడించేందుకు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఆ మీడియా సమావేశంలో రాజమౌళి ఈ సినిమా లో ఎన్టీఆర్‌ కొమురం భీమ్ గా కనిపించబోతున్నాడు. రామ్‌ చరణ్ ఈ సినిమా లో అల్లూరి సీతారామ రాజు పాత్రలో కనిపిస్తాడు అంటూ ప్రకటించాడు.

RRR Full Journey : Full journey of RRR Movie Details, All you need to Know about this film

ఈ సినిమా ను మొదట 240 వర్కింగ్‌ డేస్ ల్లో పూర్తి చేయాలనుకున్నారట. కాని 60 వర్కింగ్‌ డేస్ ఎక్కువ అయ్యి 300 రోజులు పట్టింది. ఈ సినిమా కోసం ఇద్దరు హీరోలు ఇతర నటీ నటులు మరియు సాంకేతిక నిపుణులు దాదాపుగా 200 రోజులు రిహార్సల్స్ జరిగాయట. ఈ సినిమా కు 500 కోట్ల బడ్జెట్‌ ను నిర్మాత ఖర్చు చేశాడు. మూడు వేల మంది టెక్నీషియన్స్ ఈ సినిమా కోసం వర్క్‌ చేశారు. కేవలం 25 రోజుల నైట్‌ షిప్ట్‌ వర్క్ అనుకున్నారట. కాని ఏకంగా 60 నుండి 70 రోజుల వరకు నైట్‌ వర్క్ జరిగిందట. యాక్షన్‌ సన్నివేశాల కోసం విదేశాల నుండి ఏకంగా మూడు వేల మంది ఫైటర్స్ ను రప్పించారు. సినిమా లోని కేవలం యాక్షన్ ఎపిసోడ్స్ ను 75 రోజులు చిత్రీకరించారట.

Advertisement

సినిమా లోని కీలక సన్నివేశాలను రామోజీ ఫిల్మ్ సిటీ మరియు అల్యూమీనియం ఫ్యాక్టరీ లో నిర్వహించారు. ఇంకా సిటీ శివారు లో ఉన్న కార్తికేయ స్నేహితుడి ఫామ్‌ లో సెట్స్ వేయడం జరిగింది. ఇంకా అన్నపూర్ణ స్టూడియో, వికారాబాద్‌, గుజరాత్‌, భల్గేరియా, ఉక్రెయిన్ మరియు నెదర్లాండ్‌ ల్లో చిత్రీకరించారు. రాజమౌళికి వదిన అయిన శ్రీవల్లి షూటింగ్ కు సంబంధించిన మొత్తం కో ఆర్డియేషన్‌ చూసుకునే వారు. ఇక కార్తికేయ నటీ నటుల మరియు సాంకేతిక నిపుణుల పారితోషికాలు మొదలుకుని వారి డేట్ల వరకు పలు విషయాలను చూసుకునే వాడు. 350 కోట్ల బడ్జెట్‌ తో ముగించాలనుకున్న ఈ సినిమా ను ఏకంగా 500 కోట్లు పెట్టి ముగించారు. మరి వసూళ్లు ఎలా ఉంటాయి అనేది ఇప్పటికే క్లారిటీ వచ్చేసింది. వందల కోట్ల వసూళ్లు ఈ సినిమా కోసం నమోదు అవ్వబోతున్నాయి.

Read Also : RRR Movie : దానయ్యకు దక్కేది అంతేనా?.. ఆర్ఆర్ఆర్ మెజారిటీ వాటా ఎవరికి ఎంతంటే?

Advertisement
Exit mobile version