Pushpa Box Office Collections : హిందీలోనూ తగ్గేదేలే.. బాక్సాఫీస్ దగ్గర పుష్స కలెక్షన్ల సునామీ…! ఎన్ని కోట్లంటే?

Pushpa Box Office Collections : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ డైరెక్షన్‌లో వచ్చిన పుష్ప ది రైజ్ (Pushpa The Rise).. కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. డిసెంబర్ 17న వరల్డ్ వైడ్ భారీ అంచనాలతో రిలీజైన పుష్ప అన్నీ చోట్ల కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. 2021 ఇండియన్ బిగ్గెస్ట్ గ్రాసర్‌గా పుష్ప రికార్డుల మోత మోగించింది. 2022 కొత్త ఏడాదిలోనూ పుష్ప బాక్సాఫీసు వద్ద రికార్డుల మోత మోగిస్తోంది.

పుష్ప విడుదలైన 16వ రోజునే హిందీలో రికార్డు స్థాయిలో వసూళ్లు రాబట్టింది. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా రూ. 6 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. తొలిరోజు కలెక్షన్లను దాటేసింది. హిందీ వెర్షన్ పుష్పలో ఒక్కరోజులో అతిపెద్ద కలెక్షన్ ఇదే.. బాలీవుడ్‌లో కలెక్షన్ల రికార్డులను తిరిగరాస్తోంది పుష్ప.. ఎక్కడ తగ్గేదేలే అన్నట్టుగా దూసుకుపోతోంది. ఇప్పటికే ఈ మూవీకి 56 కోట్లు వచ్చేశాయి. మరో 75 కోట్ల దిశగా పుష్ప దూసుకుపోతోంది.

Pushpa Box Office Collections : హిందీలోనూ తగ్గేదేలే..  పుష్స కలెక్షన్ల మోత…!

Pushpa Box Office Collections : Pushpa Box Office Collection Day 16 In Hindi Version Records
Pushpa Box Office Collections : Pushpa Box Office Collection Day 16 In Hindi Version Records

బాలీవుడ్ ట్రేడ్ పండితుడు తరణ్ ఆదర్శ్ ట్వీట్ ఇందుకు ఉదాహరణగా చెప్పవచ్చు. కరోనా రెండో వేవ్ తర్వాత అత్యధిక స్థాయిలో వసూళ్లు రాబట్టిన భారతీయ సినిమాగా పుష్ప సరికొత్త రికార్డు నెలకొల్పింది. చాలాచోట్ల పుష్ప ఆడుతున్న థియేటర్లలోనూ హౌజ్ ఫుల్ ఫుల్ బోర్డులు పెట్టేశారంటే పుష్ప రికార్డులు మాములు లేదని కనిపిస్తోంది. మొత్తం మీద ఇప్పటివరకూ పుష్పకు రూ. 300 కోట్లు వచ్చాయట. అల్లు అర్జున్ మాస్ స్టామినా ఇదే..

Advertisement

పుష్పరాజ్ పర్ఫార్మెన్స్‌కు బాలీవుడ్ ఫిదా అయిపోతుంది.. అల్లు అర్జున్ కోసమే వెళ్లి చూసేవాళ్లు ఎక్కువ..సినిమా థియేటర్లకు క్యూ కట్టేస్తున్నారు ఆడియన్స్. ఒక్క తెలుగులోనే కాదు.. ఇతర రాష్ట్రాల్లోనూ పుష్ప రికార్డుల మోత మోగిస్తోంది. హిందీ, తమిళంలో పుష్పకు రూ. 80 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. అదే దూకుడుతో మరో రూ.350 కోట్ల వసూలు చేసే దిశగా పుష్క వేగంగా దూసుకెళ్తోంది.
Read Also : Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి సంచలన కామెంట్స్… ఆ స్థానం నాకు వద్దు..!

Vinod Kumar

Senior Sub-Editor – Tufan9 Telugu

వినోద్ కుమార్. తెలుగు ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుఫాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2016లో జర్నలిజంలో అడుగుపెట్టారు. సినిమా, పాలిటిక్స్, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్, టెక్నాలజీ, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, హెల్త్ న్యూస్ కంటెంట్ రాస్తుంటారు.

Articles published under this author profile are written and reviewed by the Tufan9 Telugu News editorial team following strict editorial guidelines.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now
Join our WhatsApp Channel