Homeవార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

, ,

ఆత్మహత్య చేసుకుందనే వార్తలపై క్లారిటీ ఇచ్చిన మలయాళ నటి భామ..

మ‌ల‌యాళ న‌టి భామ ఆత్మహ‌త్య చేసుకుంద‌నే వార్త‌లు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయ్యాయి. స‌ద‌రు న‌టిపై 2017లో వేధింపుల కేసును తిరిగి విచార‌ణ చేస్తున్నారని, దీంతో ఆమె భ‌యాందోళ‌న‌ల‌కు గురై , ఎక్కువ మోతాదులో నిద్ర‌మాత్ర‌లు మింగి ఆత్మ‌హత్య చేసుకుందంటూ వార్త‌లు చ‌క్క‌ర్లు కొట్టాయి. అయితే ఈ వార్త‌ల‌ను ఖండిస్తూ స‌ద‌రు న‌టి భామ వివ‌ర‌ణ ఇచ్చారు. ‘‘ఇటీవ‌ల స‌మ‌యంలో నాపై భ‌యంక‌ర‌మైన ఆరోప‌ణ‌లు, రూమ‌ర్స్ వినిపించాయి. అవ‌న్నీ అవాస్త‌వం. నాపై, నా కుటుంబంపై ప్రేమాభిమానాల‌ను క‌న‌ప‌రిచిన ... Read more

By Ramesh Babu

Published on: January 16, 2022 1:49 PM

Updated on: January 16, 2022 10:55 AM

---Advertisement---

మ‌ల‌యాళ న‌టి భామ ఆత్మహ‌త్య చేసుకుంద‌నే వార్త‌లు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయ్యాయి. స‌ద‌రు న‌టిపై 2017లో వేధింపుల కేసును తిరిగి విచార‌ణ చేస్తున్నారని, దీంతో ఆమె భ‌యాందోళ‌న‌ల‌కు గురై , ఎక్కువ మోతాదులో నిద్ర‌మాత్ర‌లు మింగి ఆత్మ‌హత్య చేసుకుందంటూ వార్త‌లు చ‌క్క‌ర్లు కొట్టాయి. అయితే ఈ వార్త‌ల‌ను ఖండిస్తూ స‌ద‌రు న‌టి భామ వివ‌ర‌ణ ఇచ్చారు. ‘‘ఇటీవ‌ల స‌మ‌యంలో నాపై భ‌యంక‌ర‌మైన ఆరోప‌ణ‌లు, రూమ‌ర్స్ వినిపించాయి. అవ‌న్నీ అవాస్త‌వం. నాపై, నా కుటుంబంపై ప్రేమాభిమానాల‌ను క‌న‌ప‌రిచిన అంద‌రికీ ధ‌న్య‌వాదాలు’’ అని పేర్కొన్నారు.

లోహిత దాస్ దర్శకత్వంలో వచ్చిన నైవేద్యం సినిమాతో సినీ పరిశ్రమంలో నటి భామ అడుగు పెట్టారు. త‌ర్వాత జ‌న‌ప్రియం, ఇవ‌ర్ వివాహ‌తారియ‌ల్‌, సైకిల్ వంటి పలు సౌత్ ఇండియన్ మూవీస్‌లో న‌టించారు. ఆమె న‌టించిన చివ‌రి చిత్రం ఖ‌లీఫ‌త్ 2018లో విడుద‌లైంది. 2020లో బిజినెస్‌మేన్ అరుణ్‌ను పెళ్లి చేసుకుని సినిమా రంగానికి దూర‌మ‌య్యారు. గ‌త ఏడాది ఓ అమ్మాయికి జ‌న్మ‌నిచ్చిన ఈమె రీసెంట్‌గానే కుమార్తె పుట్టిన‌రోజును ఘ‌నంగా సెల‌బ్రేట్ చేశారు.

మోతాదుకి మించిన నిద్ర‌మాత్ర‌లు మింగ‌టంతో భామ ఆత్మ‌హ‌త్య చేసుకునే ప్ర‌య‌త్నం చేసింద‌ని, ప‌రిస్థితి సీరియ‌స్‌గా ఉండ‌టంతో ఆమెను ఓ ప్రైవేటు హాస్పిట‌ల్‌లో జాయిన్ చేశారంటూ వార్త బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఇంకేముంది.. ఈ వార్త‌లు సోష‌ల్ మీడియాలో ప‌లువ‌లు చిలువ‌లుగా స్ప్రెడ్ అయ్యింది. విష‌యం భామ వ‌ర‌కు వెళ్ల‌డంతో ఆమె వెంట‌నే స‌ద‌రు వార్త‌ల‌ను ఖండిస్తూ సోష‌ల్ మీడియా ద్వారా వివ‌ర‌ణ ఇచ్చారు. దీంతో భామ ఆత్మ‌హ‌త్య వార్త‌ల‌కు ఫుల్ స్టాప్ ప‌డింది.

,

Ramesh Babu

రమేష్ బాబు. జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుపాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ కంటెంట్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2017లో సబ్ ఎడిటర్‌గా జర్నలిజంలోకి వచ్చారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ వార్తలు, జనరల్ న్యూస్, సినిమా, టెక్నాలజీ, బిజినెస్ ఆల్ టైప్ కంటెంట్ రాస్తుంటారు.

RELEATED POSTS :

Telangana Cheyutha Pension : చేయూత పింఛన్లపై గుడ్ న్యూస్.. ఆగస్టు 15 నుంచే కొత్త పెన్షన్లు! దరఖాస్తుకు చివరి తేదీ ఇదే

Telangana Cheyutha Pension : చేయూత పింఛన్లపై గుడ్ న్యూస్.. ఆగస్టు 15 నుంచే కొత్త పెన్షన్లు! దరఖాస్తుకు చివరి తేదీ ఇదే

Gold Price : బంగారం ధరలకు మళ్లీ రెక్కలు.. రానున్న రోజుల్లో భారీ జంప్? ఇప్పుడే కొనాలా?

Gold Price : బంగారం ధరలకు మళ్లీ రెక్కలు.. రానున్న రోజుల్లో భారీ జంప్? ఇప్పుడే కొనాలా?

AP Govt Scheme : రూ.25,000 మీ ఖాతాలో పడ్డాయా? ఏపీలో చేనేత కుటుంబాలకు భారీ సాయం.. పూర్తి వివరాలు ఇవే!

AP Govt Scheme : రూ.25,000 మీ ఖాతాలో పడ్డాయా? ఏపీలో చేనేత కుటుంబాలకు భారీ సాయం.. పూర్తి వివరాలు ఇవే!

PM Modi Video : ‘ఫ్రెండ్‌షిప్ డే’ను గుర్తు చేస్తూ ప్రధాని మోదీ మరో వీడియో.. ఆగస్టు 7న ప్రతి ఒక్కరూ ఇలా చేయాలని పిలుపు!

PM Modi Video : ‘ఫ్రెండ్‌షిప్ డే’ను గుర్తు చేస్తూ ప్రధాని మోదీ మరో వీడియో.. ఆగస్టు 7న ప్రతి ఒక్కరూ ఇలా చేయాలని పిలుపు!

Bangaram Song : డీమాన్ పవన్-రీతూ చౌదరి ‘బంగారం’ సాంగ్ చూశారా? యూట్యూబ్‌లో ట్రెండింగ్.. కెమిస్ట్రీ అదిరిపోయింది!

Bangaram Song : డీమాన్ పవన్-రీతూ చౌదరి ‘బంగారం’ సాంగ్ చూశారా? యూట్యూబ్‌లో ట్రెండింగ్.. కెమిస్ట్రీ అదిరిపోయింది!

Telangana Jowar Farmers : తెలంగాణ రైతులకు బిగ్ రిలీఫ్.. అకౌంట్లలో డబ్బులు పడ్డాయ్.. ఇప్పుడే ఇలా చెక్ చేస్కోండి..!

Telangana Jowar Farmers : తెలంగాణ రైతులకు బిగ్ రిలీఫ్.. అకౌంట్లలో డబ్బులు పడ్డాయ్.. ఇప్పుడే ఇలా చెక్ చేస్కోండి..!