Jr NTR : నన్ను క్షమించాలి.. జూ.ఎన్టీఆర్ వీడియో రిలీజ్.. వార్-2 ప్రీ రిలీజ్ ఈవెంట్..!

Updated on: August 12, 2025

Jr NTR : వార్-2 మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగిన తర్వాత యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ క్షమాపణలు తెలిపారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా ఒక వీడియోను రిలీజ్ చేశారు. ‘‘ఇందాక ఒక ముఖ్యమైన విషయం చెప్పడం మర్చిపోయాను. అందరూ నన్ను క్షమించాలి.

Read Also : Bigg Boss Season 9 : బిగ్‌బాస్ సీజన్-9 ప్రోమో అదిరింది.. ఈసారి బిగ్‌బాస్‌‌నే లేపేశారుగా.. ఏంటయ్యా ఈ ట్విస్ట్..!

ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ సజావుగా జరిగేందుకు సహకరించిన రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు. సీఎం రేవంత్ గారు, డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క గారు, పోలీసు డిపార్ట్ మెంట్ అందించిన సపోర్టుకు నా పాదాభివందనాలు. ఎంతో బాధ్యతతో నా ఎన్టీఆర్ నందమూరి ఫ్యాన్స్ ఆనందానికి కారణమయ్యారు’’ అంటూ ఎన్టీఆర్ వీడియోలో పేర్కొన్నారు.

Advertisement

Jr NTR : ఆగస్టు 14నే వార్ 2 మూవీ రిలీజ్ :

ఎన్టీఆర్, హృతిక్ రోషన్ నటించిన లేటెస్ట్ మూవీ వార్ 2 అతి త్వరలో రిలీజ్ కానుంది. మల్టీస్టారర్ మూవీ కావడంతో ఈ మూవీపై భారీ స్థాయిలో అంచనాలు పెరిగాయి. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో రానున్న ఈ మూవీలో కియారా అద్వానీ హీరోయిన్‌గా నటించింది.

ఈ మూవీకి సంబంధించి పాటలు, పోస్టర్స్, టీజర్స్ మంచి హైప్ క్రియేట్ చేశాయి. ఈ వార్ 2 మూవీని ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయనున్నారు. రిలీజ్ తేదీ దగ్గర పడటంతో సినిమా ప్రమోషన్స్ వేగం పెంచేసింది చిత్రయూనిట్.

హైదరాబాద్‌లో గ్రాండ్‌గా వార్ 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏర్పాటు చేసింది. ఈ ప్రీరిలీజ్ ఈవెంట్ కోసం ఎన్టీఆర్ ఫ్యాన్స్ అత్యధిక సంఖ్యలో తరలి వచ్చారు. ఈవెంట్ సమయంలో ఫ్యాన్స్ కు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండేలా ఈవెంట్ నిర్వాహకులు అనేక జాగ్రత్తలు తీసుకున్నారు.

Advertisement

YRF స్పై యూనివర్స్‌లో తెరకెక్కించిన మూవీ తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ రైట్స్ కూడా దక్కించుకుంది. ఈ మూవీ నిర్మాత నాగవంశీ స్పెయిన్, జపాన్, అబుదాబి వంటి ప్రాంతాల్లో చిత్రీకరించారు. రూ.210 కోట్లకు పైగా భారీ బడ్జెట్‌తో వార్ 2 మూవీని నిర్మిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel