G
Telugu News » Entertainment » in big boss non stop telugu fire brand mumtaz khan has re entry
Entertainment, Latest

Big Boss Non Stop Telugu: ఎట్టకేలకు రీ ఎంట్రీ ఇచ్చిన ఫైర్ బ్రాండ్ ముమైత్ ఖాన్… ఇక హౌస్ లో రచ్చరచ్చే!

Big Boss Non Stop Telugu: బుల్లితెరపై ప్రసారమైన బిగ్ బాస్ కార్యక్రమం ప్రస్తుతం ఓటీటీలో ప్రసారం అవుతూ నాన్ స్టాప్ వినోదాన్ని అందిస్తుంది. ఈ క్రమంలోనే 4 వారాలు

Tufan9 Telugu NewsAdd as preferredsource on Google

Big Boss Non Stop Telugu: బుల్లితెరపై ప్రసారమైన బిగ్ బాస్ కార్యక్రమం ప్రస్తుతం ఓటీటీలో ప్రసారం అవుతూ నాన్ స్టాప్ వినోదాన్ని అందిస్తుంది. ఈ క్రమంలోనే 4 వారాలు పూర్తిచేసుకున్న ఈ కార్యక్రమం నుంచి ఇప్పటి వరకూ నలుగురు కంటెస్టెంట్ లు బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వెళ్లిపోయారు. గత వారం బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చారు. ఇక ఈ కార్యక్రమం మొదలైనప్పటి నుంచి ఈ సీజన్ లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఉంటుందని పెద్ద ఎత్తున వార్తలు వినిపించాయి.

అయితే వైల్డ్ కార్డు ద్వారా బిగ్ బాస్ హౌస్ లోకి ఎవరు ఎంట్రీ ఇస్తారనే విషయం గురించి సర్వత్రా ఉత్కంఠ ఏర్పడింది. ఇకపోతే ఇదివరకే ఈ సీజన్ లో ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ లు లేదా ఇదివరకు సీజన్లలో పాల్గొన్న కంటెస్టెంట్ లు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇవ్వనున్నారని వార్తలు వచ్చాయి. ఈ క్రమంలోనే ఈ సీజన్ లో మొదటి వారం హౌస్ నుంచి ఎలిమినేట్ అయిన ముమైత్ ఖాన్ సోషల్ మీడియా వేదికగా సర్ప్రైస్ అంటూ ఒక పోస్ట్ చేశారు. ఈమె ఇలా పోస్ట్ చేయడంతో కచ్చితంగా తనే బిగ్ బాస్ రీ ఎంట్రీ ఇస్తున్నారని అందరూ భావించారు.

అందరూ ఊహించిన విధంగానే ముమైత్ ఖాన్ బిగ్ బాస్ హౌస్ లోకి రీ ఎంట్రీ ఇస్తూ అందరినీ ఒక్కసారిగా ఆశ్చర్యపరిచారు. స్టైలిష్ ఎంట్రీ ఇచ్చిన ముమైత్ కోర్టు టాస్క్‌లో భాగంగా జడ్జీగా అదరగొట్టింది. మొత్తానికి ముమైత్ ఖాన్ వైల్డ్ కార్డు ద్వారా రీ ఎంట్రీ ఇవ్వడంతో ఈమె అభిమానులు సంతోషం వ్యక్తం చేశారు. ఫైర్ బ్రాండ్ గా పేరు సంపాదించుకున్న ముమైత్ రీ ఎంట్రీ ఇవ్వడంతో ఇక బిగ్ బాస్ హౌస్ లో మళ్లీ రచ్చ మొదలవడం ఖాయమని పలువురు భావిస్తున్నారు.

Ramesh Babu

రమేష్ బాబు. జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుపాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ కంటెంట్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2017లో సబ్ ఎడిటర్‌గా జర్నలిజంలోకి వచ్చారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ వార్తలు, జనరల్ న్యూస్, సినిమా, టెక్నాలజీ, బిజినెస్ ఆల్ టైప్ కంటెంట్ రాస్తుంటారు.

🏷Big Boss Non Stop TeluguMumtaz Khanre entryTollywood
f𝕏
◉   WhatsApp ChannelJoin Now
➤   Telegram ChannelJoin Now

తాజా వార్తలు