Naga chaithanya: నాగ చైతన్య కారుకి జరిమానా.. ఎందుకో తెలుసా?

హీరో అక్కినేని నాగ చైతన్య కారుకు పోలీసులు ఛలానా విధించారు. జూబ్లీహిల్స్​ చెక్‌పోస్టు వద్ద పోలీసుల తనిఖీల్లో భాగంగా.. నాగ చైతన్య కారుకు బ్లాక్‌ ఫిలిం ఉండటంతో పాటు, నంబర్​ ప్లేటు సరిగా లేకపోవడంతో రూ. 900 జిరమానా వేశారు. అనంతరం కారు అద్దాలకు ఉన్న బ్లాక్ ఫిలిం తొలగించారు. తనిఖీల్లో మొత్తం 60 కేసులు నమోదు చేసినట్లు ట్రాఫిక్‌ ఇన్‌స్పెక్టర్‌ ముత్తు తెలిపారు. ఇటీవల రోడ్డు ప్రమాదాలు అధికంగా జరుగుతుండగా.. ప్రత్యేక డ్రైవ్‌ నిర్వహిస్తున్నారు.

బ్లాక్‌ ఫిల్మ్‌లు ఇతర నిబంధనలు అతిక్రమిస్తున్నవారిని గుర్తించి వాహనాలకు జరిమానా విధిస్తున్నారు. అయితే ఈ మధ్య చాలా మంది సినీ ప్రముఖులకు పోలీసులు ఛలానాలు విధిస్తున్నారు. దీనంతటికీ కారణం… వారు నిబంధనలు పాటించకపోవడమే. ఇటీవలే మనోజ్, జూనియర్ ఎన్టీఆర్, బన్నీ కార్లకు బ్లాక్​ ఫిలిం తొలగించి.. జరిమానా విధించారు. ఇంకెప్పుడూ ట్రాఫిక్ రూల్స్ పాటించకుండా ఉండకూడదని ట్రాఫిక్ పోలీసులు వివరిస్తున్నారు. ప్రజలందరికీ ఒకే రకమైన రూల్స్ ఉంటాయని పేర్కొంటున్నారు.

Advertisement

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel