G
Telugu News » Entertainment » do you know how much remuneration chiranjeevi has taken for a subha grha ads
⚡ Entertainment, Latest

Chiranjeevi: శుభ గృహ యాడ్ కోసం చిరంజీవి ఎంత రెమ్యునరేషన్ తీసుకున్నారో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

Chiranjeevi:మెగాస్టార్ చిరంజీవి కొద్దిరోజులు విరామం తర్వాత తిరిగి ఇండస్ట్రీకి రీ ఎంట్రీ ఇచ్చి వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నారు. ఇలా వరుస సినిమాలు చేస్తూ బిజీగ

Tufan9 Telugu NewsAdd as preferredsource on Google

Chiranjeevi:మెగాస్టార్ చిరంజీవి కొద్దిరోజులు విరామం తర్వాత తిరిగి ఇండస్ట్రీకి రీ ఎంట్రీ ఇచ్చి వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నారు. ఇలా వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉండటమే కాకుండా వాణిజ్య ప్రకటనలకు కూడా సై అంటున్నాడు. ఇటీవలే శుభగ్రహ రియల్ ఎస్టేట్ కి మెగాస్టార్ చిరంజీవి బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించారు. ఈ క్రమంలోనే ఈ యాడ్ లో నటించినందుకు చిరంజీవి భారీ మొత్తంలో రెమ్యూనరేషన్ తీసుకున్నారని తెలుస్తోంది.

చిరంజీవితో పాటు ఈ యాడ్ లో సీనియర్ నటి కుష్బూ నటించారు. అలాగే హాట్ యాంకర్ అనసూయ కూడా ఇందులో సందడి చేశారు. ఇలా సుకుమార్ డైరెక్ట్ చేసిన ఈ యాడ్ సూపర్ హిట్ అయ్యింది. గతంలో థమ్స్ అప్ యాడ్ ద్వారా చిరు ఎలాంటి క్రేజ్ దక్కించుకున్నారో తిరిగి ఈ యాడ్ ద్వారా అంతే గుర్తింపు పొందారు. ఈ క్రమంలోనే శుభగ్రహ రియల్ ఎస్టేట్ కోసం మెగాస్టార్ ఏకంగా ఏడు కోట్ల రూపాయలు తీసుకున్నట్లు తెలుస్తోంది.

ఈ విధంగా అతి తక్కువ నిడివిగల ఈ యాడ్ లో నటించడం కోసం చిరంజీవి ఏకంగా ఏడు కోట్ల రూపాయల పారితోషికం తీసుకున్నారని తెలియడంతో ఎంతో మంది ఆశ్చర్యపోతున్నారు. మరికొందరు మాత్రం మెగాస్టార్ ఎక్కడున్నా మెగాస్టారే… మెగస్టార్ రేంజ్ అంటే ఇదే కదా అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Ramesh Babu ✓

రమేష్ బాబు. జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుపాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ కంటెంట్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2017లో సబ్ ఎడిటర్‌గా జర్నలిజంలోకి వచ్చారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ వార్తలు, జనరల్ న్యూస్, సినిమా, టెక్నాలజీ, బిజినెస్ ఆల్ టైప్ కంటెంట్ రాస్తుంటారు.

గమనిక: ఈ ఆర్టికల్ అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా, అవసరమైన చోట ఏఐ సహాయంతో రూపొందించబడింది. తాజా అప్‌డేట్స్ కోసం మా వెబ్‌సైట్‌ను సందర్శించండి. ఏవైనా తప్పులు గమనిస్తే contact@tufan9.com కు తెలియజేయండి.

🏷adsChiranjeeviremunerationTollywood
◉f➤𝕏
◉   WhatsApp ChannelJoin Now
➤   Telegram ChannelJoin Now

తాజా వార్తలు