Site icon Latest Telugu News | తెలుగు వార్తలు – Tufan9.com

Bigg Boss OTT Telugu : అందమైన హమీదా ఇలా అయ్యావేంటి?

biggboss-nonstop-telugu-hamida-chabbi-look

biggboss-nonstop-telugu-hamida-chabbi-look

Bigg Boss OTT Telugu : తెలుగు బిగ్ బాస్ నాన్ స్టాప్ మొదటి వారం పూర్తి చేసుకుంది. ఈ వారం రోజుల్లో ప్రేక్షకులను కొందరు కంటెస్టెంట్స్ ఎక్కువగా ఆకర్షించారు. వారిలో బిందు మాధవి, అరియానా, హమీదా ఇంకా ఒక్క ఇద్దరూ ఉన్నారు. బిందు మాధవి సైలెంట్ గా తన పని తాను చేసుకుంటూ ఎక్కడ ఎంత వరకు ఉండాలో అంత వరకు ఉంటూ అందరి అభిమానాన్ని సొంతం చేసుకుంది. మరో వైపు హమీదా కూడా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

హమీదా గత సీజన్లో సందడి చేసిన విషయం తెలిసిందే. ఆ సమయంలో సింగర్ శ్రీరామచంద్ర తో చాలా సన్నిహితంగా ఆమె ఉండి ప్రేమాయణం సాగించిన విషయం తెల్సిందే. ఇద్దరి మధ్య ప్రేమాయణం అంటూ అంతా చర్చించుకున్నారు. హమీదా వెళ్ళిపోయిన తర్వాత శ్రీరామచంద్ర కాస్త డల్‌ అయ్యాడు. గత సీజన్లో హమీదా చాలా సన్నగా నాజూగ్గా కనిపించి అందరినీ ఆకట్టుకుంది కానీ ఈ సీజన్లో మాత్రం బొద్దుగా కనిపిస్తుంది.

తాజా వీకెండ్‌ ఎపిసోడ్‌ లో నాగార్జున ఆ విషయాన్ని చెప్పుకొచ్చాడు. వాకింగ్ చేయడం లేదా అంటూ ఇండైరెక్ట్ గా కామెంట్ చేశారు. సోషల్‌ మీడియాలో కూడా ఆమె బరువు పెరిగినట్లుగా ప్రచారం జరుగుతోంది. ఇంతకు ముందు క్యూట్ గా హాట్ గా కనిపించిన ఇప్పుడు లడ్డు గా కనిపించడం ను కొందరు ప్రేక్షకులు జీర్ణించుకోలేక పోతున్నారు.

Advertisement
biggboss-nonstop-telugu-hamida-chabbi-look

కొందరు మాత్రం ముద్దుగా బొద్దుగా ఉంది అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. హమీదా గురించి సోషల్ మీడియాలో అయితే చర్చ జరుగుతోంది ఉంది. దాంతో ఆమెకు ఓట్లు వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. మొదటి వారం ఎలిమినేషన్ కు నామినేట్‌ అయిన హమీదా ప్రేక్షకుల మద్దతుతో సేఫ్‌ అయినట్లుగా క్లారిటీ వచ్చేసింది. బిగ్ బాస్ నుండి బయటకు వచ్చే వరకు హమీదా మళ్లీ బరువు తగ్గుతుందేమో చూడాలి.

Read Also : Radhe Shyam Making Video : రాధేశ్యామ్‌ మేకింగ్ వీడియో చూశారా? అద్భుత సృష్టికి సలాం కొట్టాల్సిందే..!

Advertisement
Exit mobile version