Homeవార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

,

Big Boss Non Stop Telugu: వాడివేడిగా జరిగిన నామినేషన్స్… ఈ వారం నామినేషన్ లో ఉన్న కంటెస్టెంట్ లు వీళ్లే!

Big Boss Non Stop Telugu: బుల్లితెరపై ప్రసారమవుతూ ఎంతో మంచి ఆదరణ దక్కించుకున్న బిగ్ బాస్ కార్యక్రమము ప్రస్తుతం ఓటీటీలో బిగ్ బాస్ నాన్ స్టాప్ తెలుగులో ప్రసారం అవ

By Ramesh Babu

Published on: April 5, 2022 3:00 PM

Updated on: April 5, 2022 2:00 PM

---Advertisement---

Big Boss Non Stop Telugu: బుల్లితెరపై ప్రసారమవుతూ ఎంతో మంచి ఆదరణ దక్కించుకున్న బిగ్ బాస్ కార్యక్రమము ప్రస్తుతం ఓటీటీలో బిగ్ బాస్ నాన్ స్టాప్ తెలుగులో ప్రసారం అవుతూ ప్రేక్షకులకు కావలసినంత వినోదాన్ని అందిస్తుంది. ఇకపోతే ఈ కార్యక్రమం ఇప్పటికే ఐదు వారాలను పూర్తి చేసుకొని ఐదుగురు కంటెస్టెంట్ లో ఎలిమినేట్ అయ్యారు. ఇక ఈ వారానికి సంబంధించి నామినేషన్ ప్రక్రియ కూడా వాడివేడిగా జరిగింది. ఈ నామినేషన్ ప్రక్రియలో భాగంగా హౌస్మేట్స్ ఒకరిపై ఒకరు పెద్ద ఎత్తున గొడవలు పడుతూ ఒకరినొకరు నామినేట్ చేసుకున్నారు.

pjimage 22 1ఈ విధంగా ఈ వారం నామినేషన్ ప్రక్రియలో భాగంగా హమీద, అఖిల్ మధ్య పెద్ద ఎత్తున గొడవ జరిగింది. ఆ తర్వాత అషురెడ్డి హమీదాల మధ్య గొడవ జరిగింది. ఇలా నామినేషన్ ప్రక్రియలో భాగంగా హౌస్మేట్స్ ఒకరిపై మరొకరు దూషించుకుంటూ పెద్దఎత్తున ఒకరినొకరు నామినేట్ చేసుకున్నారు. ఈ క్రమంలోనే ఈ వారం నామినేషన్ లో భాగంగా పది మంది కంటెస్టెంట్ లు నామినేషన్ లో ఉన్నారు.

Advertisement

ఈ నామినేషన్ ప్రక్రియలో అఖిల్, అజయ్, అరియానా మినహా మిగిలిన కంటెస్టెంట్ లు మిత్ర శర్మ, నటరాజ్, మహేష్ విట్టా, అషు రెడ్డి, హమీదా, బిందు మాధవి, యాంకర్ శివ, అజయ్, స్రవంతి, ముమైత్ ఖాన్ ఈ వారం నామినేషన్ లో ఉన్నారు. మరి ఎంతో రసవత్తరంగా కొనసాగిన నామినేషన్ ప్రక్రియలో ఈ వారం ఎవరు హౌస్ నుంచి బయటకు రానున్నారు అనే విషయం తెలియాల్సి ఉంది.

, ,

Ramesh Babu

రమేష్ బాబు. జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుపాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ కంటెంట్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2017లో సబ్ ఎడిటర్‌గా జర్నలిజంలోకి వచ్చారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ వార్తలు, జనరల్ న్యూస్, సినిమా, టెక్నాలజీ, బిజినెస్ ఆల్ టైప్ కంటెంట్ రాస్తుంటారు.