Anchor suma: బిగ్ స్క్రీన్ కు యాంకర్ సుమ గుడ్ బై.. ఎందుకో తెలుసా?

Anchor suma: తన మాటలు,చలాకీతనం, స్పాంటేనియస్ జోకులతో చిన్న పిల్లల నుంచి పండు ముసలి వాళ్ల వరకు అందరినీ అలరించే అందాల తార యాంకర్ సుమ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఎన్నో ఏళ్లుగా బుల్లితెరపై మకుటం లేని మహారాణిగా అవకాశాలను అందిపుచ్చుకుంటూ టీవీలను ఏలేస్తోంది. కేరళ అమ్మాయి అయినా అచ్చమైన తెలుగమ్మాయిలా మాట్లాడుతూ.. టాలీవుడ్ లో దూసుకుపోతోంది. అయితే ఇటీవలే ఆమె జయమ్మ పంచాయతీ అనే సినిమాలో నటించింది. ఇందుకోసం పెద్ద పెద్ద హీరోలతో ప్రమోషన్ కూడా ఇప్పించింది. కానీ ఎన్ని చేసినా ఈమెకు నిరాశే ఎదురయింది.

సినిమా రిలీజ్ అయి విమర్శకుల ప్రశంసలు పొందింది. కానీ జనాలను మాత్రం అంతగా ఆకట్టుకోలేకపోయింది. తనకు జనాల్లో ఉన్న ఇమేజ్, తన స్టార్ డమ్ ఈ సినిమాకు ఉపయోగపడుతుందనుకున్న సుమ ప్రయత్నం బెడిసికొట్టింది. దీంతో ఆమె సిల్వర్ స్క్రీన్ కు గుడ్ బై చెప్పాలని ఆలోచిస్తున్నారట. తనకు మొదటి నుంచి లైఫ్ ఇచ్చిన యాంకరింగ్ పీల్డ్ లోనే కంటిన్యూ అవ్వాలనుకుంటున్నారట. ఇకపై సినిమాల జోలికి రాకూడదని నిర్ణయించుకున్నారట. గెస్ట్ రోల్స్ లో తప్పితే ఇలా ఫుల్ లెంత్ సినిమాలు చేయదంటూ ఇండస్ట్రీలో టాగ్ గట్టిగా వినిపిస్తోంది.

Advertisement

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

RELATED POSTS

Join our WhatsApp Channel