Homeవార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

, ,

Actor Sachin Joshi : నటుడు సచిన్ జోషి ఆస్తులు జప్తు చేసిన ఈడీ.. ఎన్ని కోట్లంటే..?

Actor Sachin Joshi : నటుడు, వ్యాపారవేత్త సచిన్ జోషికి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌రేట్‌ నుంచి ఊహించ‌ని ప‌రిణామం ఎదురైంది. ఆయ‌న ఆస్తుల‌ను ఈడీ జ‌ప్తు చేసింది. మ‌నీ లాండ‌రింగ్ కేసులో ఈ చ‌ర్య‌లు తీసుకున్నారు. స‌చిన్ జోషి ఎస్ఆర్ఏ ప్రాజెక్టులో ఆర్థిక నేరాల‌కు పాల్ప‌డ్డార‌నే కార‌ణంతో మొత్తం రూ.410 కోట్ల ఆస్తుల‌ను ఈడీ జ‌ప్తు చేసింది. వీటిలో ఓంకార్ గ్రూప్ ఆస్తులు రూ.330 కోట్ల మేర‌కు ఉన్నాయి. మిగిలిన రూ.80 కోట్ల ఆస్తులు స‌చిన్‌కి చెందిన వైకింగ్ ... Read more

By Ramesh Babu

Published on: January 16, 2022 9:40 AM

Updated on: January 23, 2022 7:54 PM

Sachin-Joshi-ED-cases

---Advertisement---

Actor Sachin Joshi : నటుడు, వ్యాపారవేత్త సచిన్ జోషికి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌రేట్‌ నుంచి ఊహించ‌ని ప‌రిణామం ఎదురైంది. ఆయ‌న ఆస్తుల‌ను ఈడీ జ‌ప్తు చేసింది. మ‌నీ లాండ‌రింగ్ కేసులో ఈ చ‌ర్య‌లు తీసుకున్నారు. స‌చిన్ జోషి ఎస్ఆర్ఏ ప్రాజెక్టులో ఆర్థిక నేరాల‌కు పాల్ప‌డ్డార‌నే కార‌ణంతో మొత్తం రూ.410 కోట్ల ఆస్తుల‌ను ఈడీ జ‌ప్తు చేసింది. వీటిలో ఓంకార్ గ్రూప్ ఆస్తులు రూ.330 కోట్ల మేర‌కు ఉన్నాయి. మిగిలిన రూ.80 కోట్ల ఆస్తులు స‌చిన్‌కి చెందిన వైకింగ్ గ్రూపు కంపెనీల‌వి ఉన్నాయి. ఎస్ఆర్ఏ ప్రాజెక్ట్‌లో అక్ర‌మాలు జ‌రిగాయ‌నే దానిపై ఈడీ ద‌ర్యాప్తు చేప‌ట్టింది. అందులో భాగంగానే స‌చిన్ జోషి ఆస్తుల‌ను జ‌ప్తు చేశారు.

స‌చిన్ జోషి తెలుగుతో పాటు హిందీలోనూ సినిమాలు చేశారు. మౌన‌మేల‌నోయి సినిమాతో ఈయ‌న తెలుగులోనే హీరోగా త‌న కెరీర్‌ను స్టార్ట్ చేశారు. త‌ర్వాత నిను చూడ‌క నేనుండ‌లేను, ఒరేయ్ పండు, నీ జ‌త‌గా నేనుండాలి, వీడెవ‌డు వంటి చిత్రాల్లో న‌టించారు. హీరోగానే కాదు.. నిర్మాత‌గానూ ఆయ‌న సినిమాల‌ను రూపొందించారు. ఆయ‌న సినిమాల‌తో పాటు త‌మ‌న్నా న‌టించిన నెక్ట్స్ ఏంటి? వంటి సినిమాను కూడా స‌చిన్ నిర్మించారు. ఆర్జీవీ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందించిన వీర‌ప్ప‌న్ సినిమాలో పోలీస్ ఆఫీస‌ర్ విజ‌య్ కుమార్ పాత్ర‌లో న‌టించారు స‌చినో జోషి. అలాగే సెలబ్రిటీ క్రికెట్ లీగ్‌లోనూ టాలీవుడ్ తరపున ఓపెనర్ ప్లేయర్‌గా సచిన్ జోషి ఆకట్టుకుంటున్నారు.

తెలుగు నటుడు, నిర్మాత అయిన బండ్ల గణేష్‌తో స‌చిన్ జోషికి ఆర్థిక లావాదేవీల విష‌యంలో స‌మ‌స్య‌లున్నాయి. ఒకానొక ద‌శ‌లో త‌న‌ను బండ్ల గ‌ణేష్ మోసం చేశాడని స‌చిన్ ఆరోప‌ణ‌లు చేశారు. బండ్ల గ‌ణేష్ తోడేలు లాంటి వ్య‌క్తి అని, త‌న‌పై 14 కేసులు పెడితే బండ్ల గ‌ణేష్ తండ్రి వ‌చ్చి క‌న్నీళ్లు పెట్టుకుంటే వ‌దిలేశాన‌ని, బండ్ల గ‌ణేష్ నుంచి త‌న‌కు రూ.27 కోట్లు రావాల్సి ఉంద‌ని వీడెవ‌డు సినిమా ప్ర‌మోష‌న్స్ స‌మ‌యంలో స‌చిన్ జోషి ఆరోప‌ణ‌లు చేసిన సంగ‌తి తెలిసిందే.

Read Also : మన భారతీయ నదుల గురించి ఆస్తకిరమైన వాస్తవాలు ఇవే..!

, , ,

Ramesh Babu

రమేష్ బాబు. జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుపాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ కంటెంట్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2017లో సబ్ ఎడిటర్‌గా జర్నలిజంలోకి వచ్చారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ వార్తలు, జనరల్ న్యూస్, సినిమా, టెక్నాలజీ, బిజినెస్ ఆల్ టైప్ కంటెంట్ రాస్తుంటారు.

RELEATED POSTS :

Telangana Cheyutha Pension : చేయూత పింఛన్లపై గుడ్ న్యూస్.. ఆగస్టు 15 నుంచే కొత్త పెన్షన్లు! దరఖాస్తుకు చివరి తేదీ ఇదే

Telangana Cheyutha Pension : చేయూత పింఛన్లపై గుడ్ న్యూస్.. ఆగస్టు 15 నుంచే కొత్త పెన్షన్లు! దరఖాస్తుకు చివరి తేదీ ఇదే

Gold Price : బంగారం ధరలకు మళ్లీ రెక్కలు.. రానున్న రోజుల్లో భారీ జంప్? ఇప్పుడే కొనాలా?

Gold Price : బంగారం ధరలకు మళ్లీ రెక్కలు.. రానున్న రోజుల్లో భారీ జంప్? ఇప్పుడే కొనాలా?

AP Govt Scheme : రూ.25,000 మీ ఖాతాలో పడ్డాయా? ఏపీలో చేనేత కుటుంబాలకు భారీ సాయం.. పూర్తి వివరాలు ఇవే!

AP Govt Scheme : రూ.25,000 మీ ఖాతాలో పడ్డాయా? ఏపీలో చేనేత కుటుంబాలకు భారీ సాయం.. పూర్తి వివరాలు ఇవే!

PM Modi Video : ‘ఫ్రెండ్‌షిప్ డే’ను గుర్తు చేస్తూ ప్రధాని మోదీ మరో వీడియో.. ఆగస్టు 7న ప్రతి ఒక్కరూ ఇలా చేయాలని పిలుపు!

PM Modi Video : ‘ఫ్రెండ్‌షిప్ డే’ను గుర్తు చేస్తూ ప్రధాని మోదీ మరో వీడియో.. ఆగస్టు 7న ప్రతి ఒక్కరూ ఇలా చేయాలని పిలుపు!

Bangaram Song : డీమాన్ పవన్-రీతూ చౌదరి ‘బంగారం’ సాంగ్ చూశారా? యూట్యూబ్‌లో ట్రెండింగ్.. కెమిస్ట్రీ అదిరిపోయింది!

Bangaram Song : డీమాన్ పవన్-రీతూ చౌదరి ‘బంగారం’ సాంగ్ చూశారా? యూట్యూబ్‌లో ట్రెండింగ్.. కెమిస్ట్రీ అదిరిపోయింది!

Telangana Jowar Farmers : తెలంగాణ రైతులకు బిగ్ రిలీఫ్.. అకౌంట్లలో డబ్బులు పడ్డాయ్.. ఇప్పుడే ఇలా చెక్ చేస్కోండి..!

Telangana Jowar Farmers : తెలంగాణ రైతులకు బిగ్ రిలీఫ్.. అకౌంట్లలో డబ్బులు పడ్డాయ్.. ఇప్పుడే ఇలా చెక్ చేస్కోండి..!