RRB NTPC Exam 2025 : రైల్వేలో ఉద్యోగాలు పడ్డాయి.. NTPC పరీక్ష షెడ్యూల్ ఇదిగో.. ప్రిపరేషన్ టిప్స్ మీకోసం..!

Updated on: July 18, 2025

RRB NTPC Exam 2025 : రైల్వేలో ఉద్యోగాలు పడ్డాయి. NTPC పరీక్ష షెడ్యూల్ విడుదల అయింది. ఈ పరీక్ష కోసం భారత రైల్వేలలో జాబ్స్ కోసం సిద్ధమయ్యే  యువత పెద్ద సంఖ్యలో ఉన్నారు. ఈ పరీక్షల కోసం పగలు, రాత్రి తేడా లేకుండా కష్టపడుతుంటారు. కొన్ని సార్లు రైల్వే ఉద్యోగం పొందాలనే యువత కల నెరవేరదు. రైల్వేలలో ఉద్యోగం కోసం చూస్తుంటే మీరు ఈ కలను నిజం చేసుకోవచ్చు.

ఇప్పటికే, రైల్వే బోర్డు (Indian Railways) నోటిఫికేషన్ కూడా జారీ చేసింది. ఈసారి అనేక RRB పరీక్షలను నిర్వహించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. గత ఏడాదిలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు రైల్వేలు వార్షిక క్యాలెండర్ జారీ చేశాయి.

ఇప్పుడు పరీక్షలు సకాలంలో నిర్వహించనున్నారు. 2024 సంవత్సరంలో 1,08,324 పోస్టులను భర్తీ చేస్తామని RRB ప్రకటించింది. ఈ మేరకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు నియామక నోటిఫికేషన్ జారీ చేసింది.

Advertisement

RRB NTPC Exam 2025 : పైలట్, టెక్నీషియన్ పోస్టులకు నియామకం :

2025-26 సంవత్సరంలో 16 వేలకు పైగా అసిస్టెంట్ లోకో పైలట్, టెక్నీషియన్ పోస్టుల నియామకానికి RRB నోటిఫికేషన్ జారీ చేసింది. భారతీయ రైల్వేల ప్రకారం.. ఈ RRB NTPC పరీక్షలు త్వరలో నిర్వహించనున్నారు. నివేదికల ప్రకారం.. జనవరి నుంచి మార్చి వరకు అసిస్టెంట్ లోకో పైలట్ల నియామకానికి నోటిఫికేషన్ జారీ అయింది.

Read Also : SBI PO Admit Card 2025 : SBI PO అడ్మిట్ కార్డ్ 2025 త్వరలో విడుదల.. హాల్ టికెట్ డౌన్‌లోడ్ చేసుకోవాలంటే?

ఈ RRB పరీక్ష కోసం 18 లక్షలకుపైగా దరఖాస్తులు వచ్చాయి. ఈ RRB పరీక్షలు నవంబర్ 2024, మే 2025లో నిర్వహించారు. అదే సమయంలో, ఏప్రిల్ నుంచి జూన్ వరకు 14 వేలకు పైగా టెక్నీషియన్ పోస్టులకు నియామకాలకు నోటిఫికేషన్ జారీ అయింది. గతంలో ఈ రైల్వే RRB పరీక్షలు 2024 డిసెంబర్ 19 నుంచి డిసెంబర్ 30 వరకు నిర్వహించారు.

Advertisement

RRB NTPC Exam 2025 లెవల్ పరీక్ష ఎప్పుడంటే? :

RRB NTP UG లెవల్ పరీక్ష 2025 వచ్చే ఆగస్టు 7 నుంచి సెప్టెంబర్ 8 వరకు నిర్వహించనున్నారు. పరీక్ష జరిగే నగరం వివరాలు పరీక్షకు 10 రోజుల ముందు రిలీజ్ కానున్నాయి.

RRB పరీక్ష జరిగే నగరంతో పాటు, SC, ST కేటగిరీ అభ్యర్థుల కోసం ప్రయాణ సదుపాయం కూడా ఉంటుంది. అభ్యర్థి అడ్మిట్ కార్డు పరీక్ష తేదీకి 4 రోజుల ముందు జారీ అవుతుంది. మీ అడ్మిట్ కార్డును ఈజీగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

RRB NTPC Exam 2025 : ప్రిపరేషన్ టిప్స్ ఇవే :

ఏదైనా పరీక్షకు సిద్ధం అయ్యే ముందు వివరణాత్మక పరీక్షా విధానం, సబ్జెక్టులను తెలుసుకోవాలి, గ్రాడ్యుయేట్ లెవల్, అండర్ గ్రాడ్యుయేట్ లెవల్ పోస్టులకు RRB NTPC పరీక్షా విధానం సబ్జెక్టులు, ప్రశ్నల సంఖ్య, నెగిటివ్ మార్కులు, వ్యవధి పరంగా ఒకేలా ఉన్నప్పటికీ, అడిగే ప్రశ్నల స్థాయిలో తేడా ఉంటుంది. గ్రాడ్యుయేట్ లెవల్ పరీక్షలో ప్రశ్నలు గ్రాడ్యుయేషన్ లెవల్‌కు సంబంధించినవి అయితే UG పరీక్షకు, క్లిష్టత స్థాయి 12వ తరగతి ప్రకారం ప్రశ్నలు ఉంటాయి.

Advertisement

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel