ICAI CA May 2025 Exam Toppers : ICAI CA ఫౌండేషన్ కోర్సులో టాప్ 3 ర్యాంకర్లు వీరే.. వృందా అగర్వాల్ టాపర్..!

Updated on: July 6, 2025

ICAI CA May 2025 Exam Toppers : ప్రముఖ ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ICAI CA) మే రిజల్ట్స్ 2025 ఆదివారం, జూలై 6, 2025న (ICAI CA May 2025 Exam Toppers) రిలీజ్ చేసింది. పరీక్ష రాసిన అభ్యర్థులు ఫౌండేషన్, ఇంటర్, ఫైనల్ కోర్సు ఫలితాలను ICAI అధికారిక వెబ్‌సైట్ (icai.org)లో చెక్ చేయవచ్చు.

ICAI ప్రకారం.. ఫౌండేషన్ కోర్సు పరీక్షకు మొత్తం 82662 మంది అభ్యర్థులు హాజరయ్యారు. అందులో 12,474 మంది అభ్యర్థులు ఉత్తీర్ణులయ్యారు. మొత్తం ఉత్తీర్ణత శాతం 15.09 శాతంగా నమోదైంది.

లింగపరంగా చూస్తే.. 43,389 మంది పురుష అభ్యర్థులు (ICAI CA May 2025 Exam Toppers) పరీక్షకు హాజరు కాగా, 7056 మంది ఉత్తీర్ణులయ్యారు. పురుష అభ్యర్థుల ఉత్తీర్ణత శాతం 16.26 శాతంగా నమోదైంది. అదేవిధంగా, 39,273 మంది మహిళా అభ్యర్థులు పరీక్షకు హాజరు కాగా, వారిలో 5,418 మంది ఉత్తీర్ణులయ్యారు. మహిళా అభ్యర్థుల ఉత్తీర్ణత శాతం 13.80 శాతంగా నమోదైంది.

Advertisement

ICAI CA May 2025 Exam Toppers : CA ఫౌండేషన్ కోర్సులో టాపర్లు ఎవరంటే? :

ICAI CA ఫౌండేషన్ కోర్సులో టాప్ 3 ర్యాంకర్లు ఇలా ఉన్నారు. వారిలో ఘజియాబాద్‌కు చెందిన వృందా అగర్వాల్ 400 మార్కులకు 362 మార్కులతో 90.5 శాతం సాధించి అఖిల భారత స్థాయిలో టాపర్‌గా నిలిచింది.

Read Also : PM Kisan : పీఎం కిసాన్ 20వ విడత తేదీ.. లబ్ధిదారుల జాబితాలో మీ పేరు లేకుంటే రూ. 2వేలు పడవు.. ఏం చేయాలంటే?

ముంబైకి చెందిన యద్నేష్ రాజేష్ నార్కర్ 400 మార్కులకు 359 మార్కులు 89.75 శాతం సాధించి అఖిల భారత స్థాయిలో రెండవ ర్యాంకు సాధించాడు. థానే నుంచి శార్దుల్ శేఖర్ విచారే 400కి 358 మార్కులు సాధించి 89.5 శాతం సాధించాడు. అఖిల భారత స్థాయిలో మూడవ ర్యాంకును సాధించాడు.

Advertisement
icai ca final result pass percentage
ICAI CA May 2025 Exam Toppers

ICAI CA మే 2025 రిజల్ట్స్ : స్కోర్‌ కార్డును ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి? :

అభ్యర్థులు తమ రిజల్ట్స్ చెక్ చేసేందుకు ఈ కింది పేర్కొన్న దశలను ఫాలో చేయొచ్చు.

1. ICAI అధికారిక వెబ్‌సైట్‌ (icai.org)ను సందర్శించండి.
2. హోమ్ పేజీలో, ICAI CA మే రిజల్ట్స్ 2025 డౌన్‌లోడ్ లింక్‌పై క్లిక్ చేయండి.
3. లాగిన్ కోసం మీ లాగిన్ వివరాలను ఎంటర్ చేసి Submit చేయండి.
4. స్క్రీన్‌పై కనిపించే మీ రిజల్ట్స్ చెక్ చేయండి.
5. మీ రిజల్ట్స్ వెంటనే డౌన్‌లోడ్ చేసుకోండి.
6. ఫ్యూచర్ రిఫరెన్స్ కోసం ప్రింటవుట్‌ తీసుకోండి.

Advertisement

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel