AP Mega DSC 2025 Results : ఆంధ్రప్రదేశ్‌లోని పాఠశాల విద్యా శాఖ (DSE) మెగా DSC 2025 రిజల్ట్స్ ప్రకటించింది. నియామక పరీక్షకు హాజరైన (AP Mega DSC 2025 Results) అభ్యర్థులు ఇప్పుడు అధికారిక వెబ్‌సైట్ (apdsc.apcfss.in)లో తమ అర్హత స్టేటస్ చెక్ చేసుకోవచ్చు. అభ్యర్థులు తమ వివరాలతో లాగిన్ అవ్వాలి. రాష్ట్రవ్యాప్తంగా 16,347 మంది ఉపాధ్యాయుల నియామకానికి మెగా DSC పరీక్షను నిర్వహించింది.
ఏపీ డీఎస్ఈ ప్రకారం.. 3,36,307 మంది అభ్యర్థులు పరీక్షకు రిజిస్టర్ చేసుకున్నారు. 92.90శాతం మంది పరీక్షకు హాజరయ్యారు. జూన్ 6 నుంచి జూలై 2, 2025 మధ్య జరిగింది. ఏపీ డీఎస్సీ 2025 ఫలితాలను ఎలా చెక్ చేయాలి? అభ్యర్థులు తమ స్కోర్‌కార్డ్‌లను ఎలా యాక్సెస్ చేయాలి అనేది ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
- అధికారిక (apdsc.apcfss.in) వెబ్‌సైట్ విజిట్ చేయండి.
- హోమ్‌పేజీలో “Mega DSC Scorecard 2025” లింక్‌పై క్లిక్ చేయండి.
- యూజర్ నేమ్, పాస్‌వర్డ్‌ను ఎంటర్ చేయండి.
- మెగా డీఎస్సీ రిజల్ట్స్ వీక్షించండి.
- స్కోర్‌కార్డ్ PDF డౌన్‌లోడ్ చేసుకోండి.
- ఫ్యూచర్ రిఫరెన్స్ కోసం డాక్యుమెంట్ దగ్గర ఉంచుకోండి.
AP DSC 2025 రిజల్ట్స్ :
ఫైనల్ రిజల్ట్స్ ప్రకటన తర్వాత నియామక ప్రక్రియ ఈ కింది విధంగా ఉంటుంది.
మెరిట్ లిస్ట్ విడుదల :
మెగా డీఎస్సీ అభ్యర్థులను కలిపి DSC, TET స్కోర్‌ల ఆధారంగా షార్ట్‌లిస్ట్ చేస్తారు.
సర్టిఫికెట్ వెరిఫికేషన్ :
షార్ట్‌లిస్ట్ అయిన అభ్యర్థులు అవసరమైన సర్టిఫికెట్‌లతో కేటాయించిన సెంటర్లలో డాక్యుమెంట్ వెరిఫికేషన్‌కు హాజరు కావాలి.
ఫైనల్ సెలెక్షన్ లిస్ట్ :
వెరిఫికేషన్ తర్వాత అభ్యర్థుల జాబితా విడుదల చేస్తారు.
ఆపాయింట్‌మెంట్ ఆర్డర్స్ :
జిల్లా విద్యా శాఖ జారీ చేస్తుంది.
జాయినింగ్, ట్రైనింగ్ :
ఎంపికైన అభ్యర్థులు తమకు కేటాయించిన స్కూళ్లకు రిపోర్ట్ చేయాలి. అవసరమైతే ఇండక్షన్ ట్రైనింగ్ హాజరు కావాలి.
AP Mega DSC 2025 Results (FAQs) :
1. మెగా డీఎస్సీ పరీక్ష ఏంటి?
మెగా డీఎస్సీ అనేది ప్రభుత్వ పాఠశాలల్లో టీచింగ్ పోస్టులను భర్తీ చేసేందుకు ఏపీ పాఠశాల విద్యా శాఖ నిర్వహించే నియామక పరీక్ష.
2. ఏపీ మెగా డీఎస్సీ 2025లో ఎన్ని పోస్టులను ప్రకటించారు?
2025 నియామకం రాష్ట్రవ్యాప్తంగా 16,347 ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేస్తుంది.
3. ఎంత మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు?
3,36,307 మంది రిజిస్టర్ అయిన అభ్యర్థులలో 92.90శాతం మంది పరీక్షకు హాజరయ్యారు.
4. పరీక్ష ఎప్పుడు నిర్వహించారు?
మెగా డీఎస్సీ 2025 పరీక్షలు జూన్ 6 నుంచి జూలై 2 2025 వరకు జరిగాయి.
5. AP DSC 2025 రిజల్ట్స్ ఎలా చెక్ చేయాలి?
అభ్యర్థులు తమ యూజర్‌నేమ్, పాస్‌వర్డ్ ద్వారా (apdsc.apcfss.in)కి లాగిన్ అయి స్కోర్‌కార్డ్‌లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
6. మెగా డీఎస్సీ రిజల్ట్స్ తర్వాత ఏం జరుగుతుంది?
మెరిట్ జాబితా విడుదల అవుతుంది. సర్టిఫికేట్ వెరిఫికేషన్, ఫైనల్ ఆప్షన్ లిస్టు, నియామక ఉత్తర్వుల జారీ వంటివి ఉంటాయి.
7. సెలెక్షన్ కోసం TET స్కోర్‌లను పరిగణనలోకి తీసుకుంటారా?
అవును.. వర్తించే చోట మెరిట్ లిస్టును రెడీ చేసేందుకు TET స్కోర్‌లను DSC స్కోర్‌లతో కలుపుతారు.