Sravana Masam 2022 : శ్రావణ మాసంలో మాంసాహారం ఎందుకు తినకూడదో తెలుసా?

Updated on: July 13, 2022

Sravana Masam 2022 : శ్రావణ మాసం జులై 14వ తేదీ నుంచి ప్రారంభం అయి ఆగస్టు 12 వరకు కొనసాగనుంది. ఈ మాసం శివుడికి ప్రీతికరం. అందుకే ఈ నెలంతా భక్తులు శివారాధన చేస్తుంటారు. శ్రావణ మాసంలో ఆ భోళా శంకరుడిని పూజించడం వల్ల సకల శుభాలు కల్గుతాయని శాస్త్రం చెబుతోంది. కావున ఈ మాసం మొత్తం మాంసాహారానికి దూరంగా ఉంటారు. Sravana Masam 2022 అయితే కేవలం మతపరమైన కారణమే కాకుండా ఇందుకు శాస్త్రీయ పరమైన కారణం కూడా ఉందని నిపుణులు చెబుతున్నారు. అదేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

Sravana Masam 2022 : శ్రావణ మాసంలో మాంసాహారం తింటే కలిగే అనార్థాలేంటి? 

శ్రావణ మాసంలో కురిసే వర్షాల కారణంగా… వాతావరణంలో తేమ పెరిగుతుందట. ఇలాంటి సమయంలో మాంసాహారం తినడం వల్ల అది అరగదని, దాని వల్ల అనేక రకాల సమస్యలు వస్తాయని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. అలాగే ఈ సమయంలో కురిసే వర్షాల వల్ల ఫంగస్, బూజు, ఫంగల్ ఇన్ఫెక్షన్లు పెరుగుతాయట. తద్వారా దీని ప్రభావం మాంసాహార పదార్థాలపై పడి అవి త్వరగా పాడవుతాయి. దాని వల్ల కూడా మనకు అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది.

అంతే కాదండోయ్ వర్షా కాలంలో కీటకాల సంఖ్య పెరిగి పక్షలు, జంతువులు తీవ్ర అనారోగ్యానికి గురవుతాయి. అలా అనారోగ్యానికి గురైన మాంసాన్ని తింటే మన ఆరోగ్యం పాడవుతుంది. అందుకే ఈ సమయంలో నాన్ వెజ్ వద్దని చెబుతుంటారు. వర్షా కాలంలో త్వరగా జీర్ణమయ్యే ఆహారం మాత్రమే తినాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. సీఫుడ్, జంక్ ఫుడ్, నూనెతో కూడిన ఆహారాలను వీలయినంత వరకు తగ్గించాలని చెబతున్నారు.

Advertisement

Read Also : Horoscope : ఈ వారం ఈ రెండు రాశుల వారికి తీవ్ర ఒత్తిడి.. జాగ్రత్త సుమీ!

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel