Varahi Navaratri 2025 : వారాహి నవరాత్రులు.. ఎవరు చేయాలి.. ఎవరూ చేయకూడదు? తేలికైనా పూజా విధానం..!

Varahi Navaratri 2025 : ఈ వారాహి గుప్తనవరాత్రుల్లో పూజలను ఎవరు చేయాలి? అందరూ చేయొచ్చా? ఎవరూ చేయకూడదు? వారాహి గుప్తనవరాత్రుల్లో చాలా తేలికైనా పూజా విధానం గురించి తెలుసుకుందాం..

Varahi Navaratri 2025 : ఆషాడ మాసం వచ్చేసింది. వారాహి అమ్మవారి నవరాత్రులు కూడా మొదలు కానున్నాయి. 9 రోజుల పాటు 9 పూజా విధానాలతో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి పూజిస్తుంటారు. అమ్మవారికి ఎలాంటి దూపం వేయాలి? ఏయే వస్తువులు కావాలి? అనే విషయాలపై చాలామందికి అనేక సందేహాలు ఉంటాయి.

జూన్ 26వ తారీఖు నుంచి జూలై 4వ తారీఖుతో వారాహి నవరాత్రులు సమాప్తమవుతాయి. నవరాత్రులు ఏడాదికి 4 వస్తాయి.. ఒకటి ప్రత్యక్ష నవరాత్రులు.. రెండోది గుప్త (Varahi Navratri benefits) నవరాత్రులు.. ప్రత్యక్ష నవరాత్రులు ఆశ్వీయుజ, చైత్రమాసంలో వచ్చే నవరాత్రులుగా పిలుస్తారు.

గుప్తనవరాత్రులు ఆషాడ మాసం, మాఘమాసంలో వచ్చే నవరాత్రులుగా పిలుస్తారు. లలితా అమ్మవారికి దుష్ట సంహారంలో సాయం చేసినందుకు వారాహి, రాజేశ్వరి అమ్మవారులకు సంబంధించిన నవరాత్రులుగా చెబుతారు. విశేషం ఏమిటంటే.. ఆషాడ వారాహి నవరాత్రులు ఆరుద్ర నక్షత్రంతో మొదలై స్వాతి నక్షత్రంతో సమాప్తమవుతాయి.

Advertisement

వారాహి అమ్మవారిని ప్రత్యేక పూజలతో ఆచరిస్తే అద్భుతమైన ఫలితాలను పొందవచ్చు. ఇంతకీ, ఈ వారాహి గుప్తనవరాత్రుల్లో పూజలను ఎవరు చేయాలి? అందరూ చేయొచ్చా? ఎవరూ చేయకూడదు? అసలు వారాహి గుప్తనవరాత్రుల్లో చాలా తేలికైనా పూజా విధానం గురించి తెలుసుకుందాం..

PM Kisan 22nd installment
PM Kisan 22nd installment : పీఎం కిసాన్ రైతులకు బిగ్ అలర్ట్.. e-KYC మాత్రమే కాదు.. ఈ డాక్యుమెంట్ లేకున్నా 22వ విడత డబ్బులు రావు

Varahi Navaratri 2025 : వారాహి అమ్మవారికి ఏ సమయంలో పూజించాలి? :

వారాహి నవరాత్రుల సందర్భంగా ముందుగా అమావాస్య రోజున ఎలాంటి వస్తువులను తీసుకోకూడదని భావిస్తుంటారు. అమ్మవారికి సూర్యాస్తమయం తర్వాత అమ్మవారిని పూజిస్తే మరిన్ని ఫలితాలను పొందవచ్చు. జూన్ 25న అమవాస్య కాకుండా జూన్ 26న పూజకు కావాల్సిన సామాన్లను తెచ్చుకోవచ్చు.

వారాహి అమ్మవారి చిత్రపటంతో పాటు, కలశం కూడా పెట్టుకోవాలి. అమ్మవారికి చక్కగా అలంకరణ చేసి సంబంధించిన పూజా ద్రవ్యాలను వారాహి అమ్మవారికి షోడశోపచార పూజ విధానంలో పూజ నిర్వహించాలి. అర్చన కూడా చేసుకోవాలి.

Advertisement

కంద దీపారాధనతో అద్భుతమైన ఫలితాలు :
అమ్మవారికి ఇష్టమైన ద్రవ్యములు, నైవేద్యములు, దీపారాదన వంటివి తప్పనిసరిగా చేయాలి. 9 రోజుల పాటు అమ్మవారిని పూజించాలి. అమ్మవారికి కంద దీపారదన అంటే చాలా ప్రీతికరం. పూజ అనంతరం కంద గడ్డను ప్రసాదంగా చేసుకుని తీసుకోవచ్చు.

కూరలా వండుకుని తినవచ్చు. పూజా సామాగ్రిలో ధూపం కూడా ఉండాలి. ఘాటైన ధూపాన్ని వేయాలి. అమ్మవారికి ఇలాంటి ధూపం అంటే చాలా ఇష్టం. సాంబ్రాణీ, మైసాచీ ధూపంతో ఇల్లంతా పట్టిస్తే ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ ఉన్నా వెంటనే బయటకు వెళ్లిపోతుంది.

Rohini Bazaar Deoghar
Rohini Bazaar Deoghar : ఇదో పురాతన షాపింగ్ మాల్.. ఇక్కడ బట్టల ధర రూ. 30, కూరగాయల సంచి రూ. 100.. అన్నీ చౌకగానే..!

Varahi Navaratri 2025 : అమ్మవారిని ఎవరూ ఆరాధించాలంటే..? :

వారాహి అమ్మవారి చేతిలో నాగలి, రోకలి ఉంటాయి. సస్య దేవత అని అర్థం. హిరణ్యాక్షుడిని సంహరించిన విష్ణు రూపాన్ని చూసి అమ్మవారు కూడా వారాహి (Gupta Navratri 2025) అమ్మవారిగా అవతరించింది. వారాహి అమ్మవారిని లక్ష్మీదేవిగా చెబుతారు. రైతులు ముఖ్యంగా వారాహి అమ్మవారిని ఆరాధిస్తే చాలా మంచిది. నాగలితో పోలం దున్నితూ వారాహి దేవి నమ: అంటూ మంత్రాన్ని జపిస్తే అద్భుతమైన లాభాలు వస్తాయి.

Advertisement

Read Also : Ashada Amavasya 2025 : ఆషాఢ అమావాస్య నాడు పూర్వీకులు భూమిపైకి వస్తారు.. ఈ రోజున కచ్చితంగా ఈ ఒక్క పని చేయండి..

ఏయే పరిస్థితుల్లో పూజ చేయరాదంటే? :

వారాహి పూజ ప్రారంభం సమయంలో రెండు మూడు రోజులు మయలా వంటివి వస్తే.. 11 రోజుల వరకు ఆగాల్సి ఉంటుంది. పౌర్ణమి రోజున పూజ చేసుకోవాలి. మయల తీరిన తర్వాత మాత్రమే వారాహి అమ్మవారి పూజను కొనసాగించాలి. మహిళల్లో వచ్చే నెలసరి సమయాల్లో ఒకటి రెండు రోజులు కాకుండా మూడో రోజు నుంచి మొదలుపెట్టవచ్చు..

ఐదో రోజు లేదా ఏడో రోజు లేదా 8, 9 రోజులు ఆ మూడు రోజులు చేయొచ్చు.. ఒకవేళ పూజ మధ్యలో నెలసరి వస్తే నాల్గో రోజు, ఐదో రోజు తలస్నానం తప్పక చేయాలి. ఏడో రోజు నుంచి పూజ విధానం మొదలుపెట్టవచ్చు. సూర్యోదయం తర్వాత పూజను ఆచరించవచ్చు.

Advertisement
IND vs SA 1st T20I Hardik Pandya Enters Elite T20 Club After Virat Kohli And Rohit Sharma
IND vs SA 1st T20I : హార్దిక్ పాండ్యా సిక్సర్లతో సెంచరీ.. కేఎల్ రాహుల్ రికార్డు బ్రేక్.. టాప్ 5లో ఎవరంటే?

శ్వేతవర్ణం ఫొటో పెట్టుకోవాలి :
మిగిలిన రోజులను ఒకే రోజున కొన్ని సమయాల్లో పూజను ఆచరించుకోవచ్చు. లేదంటే.. ఏడు రోజులు లేదా ఐదు రోజులు లేదా మూడు రోజులు లేదంటే నవమి ఆఖరి రోజున కూడా పూజ చేయొచ్చు. శ్వేతవర్ణంలో ఉన్న అమ్మవారి విగ్రహం లేదా ఫొటోను పూజకు పెట్టుకోవచ్చు. తెల్లటి వస్త్రం లేదా ఆకుపచ్చ వస్త్రాన్ని ధరించిన అమ్మవారి ఫొటో చాలా శ్రేయస్కరం.. నలుపు, ఎరుపు రంగు కలిగిన ఫొటోను అసలు పెట్టుకోవద్దు.

Advertisement

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Tufan9 తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ సబ్ ఎడిటర్‌గా ఉన్నాను. బ్రేకింగ్ న్యూస్, తెలంగాణ , ఆంధ్రప్రదేశ్, జాతీయ, అంతర్జాతీయ వార్తలు, స్పోర్ట్స్, హెల్త్, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, మూవీలు, బిజినెస్ వార్తలను రాస్తుంటాను.

RELATED POSTS

Join our WhatsApp Channel