Horoscope : ఈరోజు ఈ రెండు రాశుల వాళ్లకి లక్కే లక్కు.. అన్నింటా విజయం!

Horoscope : ఈ రోజు అనగా ఆగస్టు 28వ తేదీ నాడు పన్నెండు రాశుల వారి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలిపారు. ప్రధాన గ్రహాలైన గురు, రాహు, కేతు, శని సంచారం వల్ల ఈ రెండు రాశుల వాళ్లకి చాలా బాగుంటుందని చెప్పారు. అయితే ఆ రెండు రాశులు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

వృశ్చిక రాశి.. వృశ్చిక రాశి వాళ్లకు శుభకాలం. మొదలుపెట్టిన కార్యాలను దిగ్విజయంగా పూర్తి చేస్తారు. తోటివారి సహకారాలు అందుతాయి. బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. మీ బుద్ధిబలంతో కీలక సమస్యలను పరిష్కరించి అందరి మన్ననలను పొందుతారు. ఒక వార్త ఉత్సాహాన్ని ఇస్తుంది. ఏకాగ్రతతో స్పష్టమైన నిర్ణయాలు తీసుకోండి. నమ్మిన ధర్మమే ముందుకు నడిపిస్తుంది. గణపతి ఆరాధన మంచిది.

Advertisement

మీన రాశి.. మీన రాశి వాళ్లు మీమీ రంగాల్లో విజయం సాధించే దిశగా ముందుకు సాగుతారు. కీర్తి పెరుగుతుంది. ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంటారు. ఒక శుభవార్త మీ ఇంట్లో సంతోషాన్ని నింపుతుంది. ఒక ముఖ్య వ్యవహరంలో ఆర్థిక సాయం అందుతుంది. అనుకున్న పనులను అనుకున్నట్టు చేయగలుగుతారు. కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని మధుర క్షణాలను గడుపుతారు. శ్రీరామనామాన్ని జపించడం ఉత్తమం.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel