Homeవార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

, ,

Marraige tips : వయసు మీరిపోతున్నాపెళ్లి జరగట్లేదా.. అయితే 21 శనివారాలు ఇలా చేయండి!

Marraige tips : మన హిందూ సంప్రదాయాల ప్రకారం శనివారం చాలా పవిత్రమైన రోజు. ఈ తేదీని విష్ణుమార్తికి అంకితం చేశారు. ఈ రోజున విష్ణువు అవతారాలకు చెందిన రాముడు, కృష్ణు

By Vinod Kumar

Published on: May 20, 2022 6:49 PM

Updated on: May 20, 2022 7:14 PM

Marraige tips

---Advertisement---

Marraige tips : మన హిందూ సంప్రదాయాల ప్రకారం శనివారం చాలా పవిత్రమైన రోజు. ఈ తేదీని విష్ణుమార్తికి అంకితం చేశారు. ఈ రోజున విష్ణువు అవతారాలకు చెందిన రాముడు, కృష్ణుడు, నరసింహ స్వామికి ప్రత్యేక పూజలు చేస్తారు. విష్ణువును పూజించడానికి శనివారం కూడా మంచి రోజే. అయితే ఈ రోజున పూజలు చేయడం వల్ల వివాహ సమస్యలతో పాటు పలు రకాల సమస్యలను అధిగమించవచ్చునని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. అలాగే వయసు మీరిపోతున్న పెళ్లి కాకపోతే…. కొన్ని వారాల పాటు ఈ రోజున విష్ణువును పూజించడం వల్ల కచ్చితంగా పెళ్లి అవుతుందని చెబుతున్నారు.

Marraige tips
Marraige tips

అయితే శని వారం రోజు ఉపవాసం ఉండాలట. అలాగే ఈరోజు పసుపు రంగు దుస్తులు ధరించి, పసుపు రంగు పండ్లను, పూలను స్వామి వారికి నైవేద్యంగా సమర్పించాలట. అలాగే పసుపు రంగులో ఉండే పదార్థాలను మాత్రమే ఉపవాసం తర్వాత తినాలట. శనగ పిండి లడ్డూలు, శనగ పిండి రోటీలు తినడం ఉత్తమం. అంతే కాకుండా సుందర కాండను పఠించడం కూడా చాలా మంచిది. వీటితో పాటు 21 శనివారాల పాటు నిరంతరం సుందరకాండ చదవడం వల్ల కచ్చితంగా వివాహం జరుగుతుందట. అలాగే సీతారాములతో కూడిన హనుమంతుడి చిత్రం పటం ముందే దీన్ని పారాయణం చేయాలట.

Advertisement

Read Also :

, , ,

Vinod Kumar

వినోద్ కుమార్. తెలుగు ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుఫాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2016లో జర్నలిజంలో అడుగుపెట్టారు. సినిమా, పాలిటిక్స్, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్, టెక్నాలజీ, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, హెల్త్ న్యూస్ కంటెంట్ రాస్తుంటారు.