Site icon Latest Telugu News | తెలుగు వార్తలు – Tufan9.com

Chanakya niti : ఈ విషయాలను ఎవరితోనూ పంచుకోకూడదు… నవ్వుల పాలవుతారు!

Chanakya niti : ఆచార్య చాణక్యుడు తన నీతి శాస్త్రంలో మానవ జీవితానికి సంబంధించిన అనేక ముఖ్యమైన విషయాలను ప్రస్తావించారు. ఒక వ్యక్తి తన కర్మలను బట్టి ఫలాలను పొందుతాడని చాణక్య నమ్మకం. అయితే చాణక్య నీతి ప్రకారం ప్రతి వ్యక్తి తన జీవితానికి సంబంధించి కొన్ని విషయాలను అందరితో పంచుకోకూడదు.

ఎందుకంటే కొన్ని సార్లు ఈ పొరపాట్లు జీవితంపై తీవ్ర ప్రభావం చూపిస్తాయని పేర్కొన్నాడు. తన జీవితానికి సంబంధించిన కొన్ని విషయాలను అందరితో పంచుకోవడం మానుకోవాలని ఆచార్య చాణక్య చెప్పారు.

Chanakya niti sutralu for healthy ife

ఈ పొరపాటు అలసత్వానికి కారణం కావచ్చు లేదా ఇతరుల దృష్టిలో మిమ్మల్ని నవ్వుల పాలు చేస్తుంది. చాణక్య నీతి ప్రకారం కొన్ని విషయాలను మీరు ఎవరికైనా పంచుకునే ముందు 10 సార్లు ఆలోచించాల్సి ఉంటుంది. జీవితంలో సమస్యలు వస్తూనే ఉంటాయి. ఇతరులతో వాటిని పంచుకోవాలనుకున్నప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోండి. ఎ వ్యక్తి తన శారీరక సంబంధాన్ని బహిరంగ పరచకూడదు.

Advertisement

ఈ తప్పుకు శిక్షను వైవాహిక జీవితాన్ని నాశనం చేసే రూపంలో ఎదుర్కోవాల్సి ఉంటుంది. కొందరికి జోక్ చెప్పి తమది తామే నవ్వుకుంటారు. సమయం, సందర్భం చూసుకోకుండా ఎక్కడైనా ఎగిరి గంతేసే అలవాటు ఉంటుంది. ఇలా చేయడం వల్ల సంతోషం ఉండవచ్చు కానీ వీటి వల్ల ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుందని చాణక్య నీతి చెబుతోంది.

Read Also : Chanakya Niti : ఆచార్య చాణక్య నీతిశాస్త్రం.. జీవితంలో ఈ మూడు విషయాలనూ ఎలాంటి మొహమాటం అక్కర్లేదు అంటున్నాడు..

Read Also : Chanakya Niti : ఆచార్యుడు ఆనాడే చెప్పాడు.. ఇలా చేస్తే.. ధనవంతులు కావడం ఖాయం..!

Advertisement

Read Also :  Viduru Niti : జీవితంలో సక్సెస్ కావాలంటే ఈ మూడు విషయాలనూ వదులుకుంటే చాలు: విదురు నీతి

Exit mobile version