Chittoor accident: చిత్తూరులో ఘోర అగ్ని ప్రమాదం, ముగ్గురు మృతి!

Chittoor accident: చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పేపర్ ప్లేట్ల తయారీ యూనిట్ లో పెద్ద ఎత్తున మంటలు చెలరేగి ముగ్గురు వ్యక్తులు చనిపోయారు. జిల్లా కేంద్రంలోని రంగాచారీ వీధిలో రాత్రి 2 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. భాస్కర్ అనే వ్యక్తికి ఇదే వీధిలో రెండతస్తుల భవనంలో ఉంటున్నారు. అందులో గ్రౌండ్ ఫ్లోర్ లో పేపర్ ప్లేట్ల తయారీ యూనిట్ నిర్వహిస్తున్నారు. రెండో అంతస్తులో వీరు ఉంటుున్నారు. అయితే మంగళవారం రోజు అర్ధరాత్రి అంతా పడుకొని ఉండగా… ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. పేపర్ ప్లేట్లు త్వరగా కాలిపోవడంతో మంటలు మరింత చెలరేగి రెండో అంతస్తుకు కూడా మంటలు అంటుకున్నాయి. ఇంట్లో ఉన్న ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.

మృతులు భాస్కర్, ఢిలీ బాబు, బాలాజీగా పోలీసులు గుర్తించారు. భాస్కర్ కుమారుడే డిల్లీ బాబు. అయితే ప్రమాదం జరిగిన వెంటనే అగ్నిమాపక శాఖకు కాల్ చేసినప్పటికీ… ఫైరింజన్లు సమయానికి రాలేవని స్థానికులు ఆరోపిస్తున్నారు. అయితే అగ్ని మాపక శాఖ అక్కడికి రాకముందే స్థానికులు వెళ్లి తలుపులు బద్ధలు కొట్టారు. అప్పటికే ముగ్గురు వ్యక్తులు అపస్మారక స్థితిలో ఉన్నారు. వారిని చూసి వెంటనే ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు వారు ముగ్గురు చనిపోయినట్లు ధృవీకరించారు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.

Advertisement

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel