Homeవార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

, ,

Minor girl rape : జ్యూస్ తాగిస్తానంటూ.. అత్యాచారం చేశాడు.. ఆపై!

Minor girl rape : నిజామాబాద్ జిల్లా జక్రాన్ పల్లిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. జ్యూస్ తాగిస్తాను రమ్మని పిలిచి అత్యాచారం చేశాడో ప్రబుద్ధుడు. అయితే మూడు నెలల క్రి

By Vinod Kumar

Published on: April 24, 2022 10:59 AM

Updated on: April 25, 2022 7:24 AM

Minor girl rape

---Advertisement---

Minor girl rape : నిజామాబాద్ జిల్లా జక్రాన్ పల్లిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. జ్యూస్ తాగిస్తాను రమ్మని పిలిచి అత్యాచారం చేశాడో ప్రబుద్ధుడు. అయితే మూడు నెలల క్రితం జీవనోపాధి కోసం జక్రాన్ పల్లి వచ్చారు దంపతులు. ఊరి చివరన గుడిసె వేసుకొని జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలోనే భర్త.. భార్యా బిడ్డను వదిలేసి వెళ్లిపోయాడు. ఏం చేయాలో పాలుపోని బాలిక తల్లి అక్కడే ఉండి కూలీ పనులు చేసుకుంటు కుమార్తెను పెంచుకుంటోంది.

Minor girl rape
Minor girl rape

అయితే రోజూ మాదిరిగానే ఈనెల 22వ తేదీన బిడ్డను ఇంట్లో వదిలేసి కూలీ పనులకు వెళ్లింది. విషయం గమనించిన స్థానికుడు నారాయణ పండ్ల రసం ఇప్పిస్తానంటూ బాలికకు ఆశ చూపించాడు. పాపను వెంట పెట్టుకొని కొండ ప్రాంతానికి వెళ్లాడు. అయితే తల్లి ఇంటికి వచ్చే సరికి బిడ్డ లేదు. కూతురు ఏమై పోయిందో అనుకుంటూ వెతికింది. ఈ క్రమంలోనే కుమార్తెపై జరిగిన అఘాయిత్యం గురించి తెలుసుకుంది. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు.. బాలికను ఆస్పత్రికి తరలించారు.

Advertisement

Read Also :Electric bike blast : ఎలక్ట్రిక్ బైక్ పేలి వ్యక్తి మృతి.. ముగ్గురికి తీవ్ర గాయాలు!

, , ,

Vinod Kumar

వినోద్ కుమార్. తెలుగు ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుఫాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2016లో జర్నలిజంలో అడుగుపెట్టారు. సినిమా, పాలిటిక్స్, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్, టెక్నాలజీ, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, హెల్త్ న్యూస్ కంటెంట్ రాస్తుంటారు.