EX MLA Daughter suicide: మాజీ ఎమ్మెల్యే కూతురు ఆత్మహత్య.. ఇంట్లోనే ఉరి!

మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు కుమార్తె మహాలక్ష్మి (25) ఆత్మహత్య చేసుకున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం సారపాకలోని తమ సొంత ఇంట్లోనే ఉరి వేసుకొని చనిపోయారు. అయితే ఉదయం ఎంత సేపటికీ ఆమె తలుపులు తీయకపోగా… కుటుంబ సభ్యులు తలుపులు పగులగొట్టారు. కూతురు తాడుకు వేలాడుతూ కనిపించడం చూసి బావురు మన్నారు. ఓ వైపు బాధను దిగమింగుకుంటూనే హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు.. మహాలక్ష్మి అప్పటికే మృతి చెందినట్లు నిర్ధరించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

అయిచే ఇటీవలే మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు మహాలక్ష్మి ఎంబీబీఎస్​ పూర్తి చేశారు. కూతురు ఆత్మహత్య చేసుకోవడంతో మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. అయితే మహాలక్ష్మీ అసలు ఎందుకు ఆత్మహత్య చేసుకుందనే విషయం మాత్రం ఇంకా తెలియ రాలేదు. అయితే గతంలో తాటి వెంకటేశ్వర్లు అశ్వరావు పేట, పినపాక శాసన సభ్యునిగా పని చేశారు.

Advertisement

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel