Crime News: కన్న కూతురిని బెదిరించి గత కొన్ని సంవత్సరాలుగా అత్యాచారం.. రెండవ భార్య ఫిర్యాదుతో వెలుగులోకి వచ్చిన నిజం!

Crime News: ప్రస్తుత కాలంలో కొంతమంది పురుషులు వావివరుసలు మరచి మహిళల మీద అత్యాచారాలకు పాల్పడుతున్నారు. అక్క,చెల్లి, తల్లి, కూతురు అన్న వావి వరసలు మరిచి వారి మీద లైంగిక దాడికి పాల్పడుతున్నారు. ప్రతి రోజు ఇలాంటి సంఘటనలు ఎన్నో వెలుగులోకి వస్తున్నాయి. ఇటీవల అచ్చం ఇలాంటి సంఘటన ఒకటి చోటు చేసుకుంది. భార్య విడాకులు ఇచ్చి వదిలి వెళ్లిపోయిన తర్వాత కూతురి మీద కన్నేసిన తండ్రి ఆమెను బెదిరించి ఆమెపై అత్యాచారానికి పాల్పడిన ఘటన ప్రస్తుతం వెలుగులోకి వచ్చింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..వివరాల ప్రకారం మహాబుబ్ నగర్ జిల్లాకు చెందిన రమెష్ అనే వ్యక్తి బతుకు దెరువు కోసం నగరానికి వచ్చి రోజు కూలి పనులు చేస్తూ జీవనం సాగించేవాడు. అయితే కొన్ని సంవత్సరాల క్రితం రమేష్ మొదటి భార్య కొన్ని మనస్పర్థల కారణంగా రమేష్ తో గొడవపడి విడాకులు తీసుకొని వారిద్దరికీ పుట్టిన పాపను రమేశ్ వద్ద వదిలి వెళ్ళింది. అనంతరం రమేష్ భార్య రెండవ వివాహం చేసుకోగా.. రమేష్ కూడా రెండవ వివాహం చేసుకున్నాడు.

ఈ క్రమంలో రమేష్ మొదటి భార్య కూతురు కి కొన్ని సంవత్సరాలు రాగా తన కూతురు మీద కన్ను వేసిన రమేష్ తన లైంగిక వాంఛలు తీర్చుకోవడానికి కూతురిని బెదిరించి ఆమె మీద గత కొన్ని సంవత్సరాలుగా అత్యాచారానికి పాల్పడుతున్నాడు. ఈ విషయం ఎవరికైనా చెబితే నీ అంతు చూస్తా అంటూ తండ్రి బెదిరించడం తో చిన్నారి భయపడి ఈ విషయం ఎవరికీ చెప్పకుండా ఉంది.

Advertisement

ఇదిలా ఉండగా భర్త ప్రవర్తనను గమనించిన రెండవభార్య ఇది సరైన పద్ధతి కాదు అంటూ తను ఎన్నిసార్లు వారించినా కూడా రమేష్ తన పద్ధతి మార్చుకోలేదు. ఈ క్రమంలో రమేష్ రెండవభార్య తన భర్త గురించి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు విచారణ జరిపి రమేష్ ని అరెస్టు చేసి రిమాండ్ కి తరలించారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel