Naga Chaitanya : చైతన్య ఇంకా సమంతను మర్చిపోలేకపోతున్నారా… తన గుర్తుగా వాటిని అందుకే ఉంచుకున్నారా?

Updated on: July 8, 2022

Naga Chaitanya : టాలీవుడ్ ఇండస్ట్రీలో క్రేజీ కపుల్ గా ఉన్నటువంటి వారిలో సమంత నాగచైతన్య జంట ఒకటి. వీరిద్దరూ ప్రేమించుకుని ఒకరినొకరు బాగా అర్థం చేసుకున్న తర్వాత వీరి ప్రేమను పెద్దలు ముందు ఉంచి పెద్దల సమక్షంలో ఎంతో ఘనంగా వివాహం చేసుకున్నారు. అయితే వీరి వివాహ బంధం ఎక్కువ కాలం పాటు నిలబడలేదు. పెళ్లయిన నాలుగు సంవత్సరాలకి ఈ జంట విడాకులతో విడిపోయారు. గత ఏడాది అక్టోబర్ నెలలో విడాకుల గురించి ప్రకటించి అందరిని షాక్ కి గురి చేశారు. ఇకపోతే వీరు విడాకులు ప్రకటన వచ్చి దాదాపు 10 నెలలు అవుతున్న వీరివిడాకులు గురించి ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Naga Chaitanya
Naga Chaitanya

ఇకపోతే వీరిద్దరూ విడాకులు తీసుకొని విడిపోయిన తర్వాత ఎవరి జీవితం వాళ్లు స్వేచ్ఛగా జీవిస్తున్నారు. కానీ విడాకులకు గల కారణం ఏంటి అనే విషయం మాత్రం ప్రకటించలేదు. ఇక విడాకుల తర్వాత సమంత వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ కాస్త ఎక్కువగానే గ్లామర్ షో చేస్తున్నారు. అలాగే ఈమె పూర్తిగా చైతన్య జ్ఞాపకాల నుంచి బయటపడి తన కెరియర్ పై దృష్టి సారించారు. నాగచైతన్య మాత్రం ఇప్పటికి సమంత జ్ఞాపకాలను మర్చిపోలేక పోతున్నారని తెలుస్తోంది.

Naga Chaitanya : నాగచైతన్య సమంత ఫోటో వైరల్…

Advertisement

సోషల్ మీడియాలో పెద్దగా యాక్టివ్ గా ఉండని నాగచైతన్య ఎప్పుడో ఒకసారి సోషల్ మీడియాలో పోస్టులు పెడుతుంటారు. అయితే సోషల్ మీడియా వేదికగా నాగచైతన్య సమంత కలిసి దిగిన ఫోటోలను ఇప్పటికీ అలాగే పెట్టుకున్నారని, వాటిని డిలీట్ చేయలేదని తెలుస్తుంది. ఈ విధంగా నాగచైతన్య సమంత ఫోటోలను అలాగే పెట్టడంతో చైతన్య ఇప్పటికి సమంతను మర్చిపోలేకపోతున్నారా.. అందుకే తన ఫోటోలను డిలీట్ చేయడం లేదా అంటూ పెద్ద ఎత్తున నెటిజన్లు సందేహాలను వ్యక్తపరుస్తున్నారు.

Read Also :  Naga Chaitanya : నాగ చైతన్య ఎమోషనల్ పోస్ట్.. ఎవరి గురించో తెలుసా? ఫొటోలు వైరల్!

Advertisement

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel