Kajal Aggarwal Baby Bump : కాజల్ అగర్వాల్ బేబీ బంప్‌పై ట్రోల్స్.. సమంత, హన్సిక, మంచు లక్ష్మీ ఇచ్చిపడేశారు..!

Kajal Aggarwal Baby Bump : టాలీవుడ్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ సోషల్ మీడియా వేదికగా తన పర్సనల్ ఫొటోలను షేర్ చేస్తుంటుంది. కొన్ని రోజులుగా కాజల్ బేబి బంప్ కు సంబంధించిన ఫొటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. కాజల్ బేబీ బంప్ ఫొటోలను చూసిన నెటిజన్లు ట్రోల్స్ చేస్తున్నారు. మొన్నటికి మొన్న సాయి పల్లవిపై బాడీ షేమింగ్ కామెంట్స్ చేసిన ట్రోలర్స్.. ఇప్పుడు కాజల్ బేబీ బంప్ పై ట్రోలింగ్ చేయడం మొదలు పెట్టారు. తనపై వచ్చిన ట్రోలింగ్ పై స్పందించన కాజల్ అగర్వాల్ నెటిజన్లకు ఇచ్చిపడేసింది. తనదైన శైలిలో గట్టిగానే బదులిచ్చింది. కాజల్ గర్భంపై ట్రోలర్స్ దారుణమైన కామెంట్ చేశారు.

బాగా లావయ్యావంటూ బాడీ షేమింగ్ కామెంట్ చేశారు. కాజల్ అగర్వాల్ మౌనంగా ఉండకుండా ట్రోలింగ్ కు చెక్ పెట్టేసింది. మహిళలపై గౌరవం కలిగేలా హుందాగా సమాధానమిచ్చింది కాజల్.. ముఖ్యంగా అర్థం చేసుకోలేని మూర్ఖులు తెలుసుకోవాల్సింది ఏంటంటే.. గర్భధారణ సమయంలో మహిళల్లో అనేక మార్పులు జరుగుతుంటాయని చెప్పుకొచ్చింది.

గర్భధారణ సమయంలో బరువు పెరుగుతారు. అనేక మార్పులు చోటు చేసుకుంటాయి. హార్మోన్ల మార్పులు జరుగుతాయి. కడుపులో బిడ్డ పెరిగే కొద్దీ పొట్ట పెద్దదిగా అవుతుంది. శిశువుకు తగినట్టుగా శరీరం రెడీ అవుతుంది. కొందరికి శరీరం పెద్దదైన చోట స్ట్రెచ్ మార్క్స్ రావొచ్చు.. కొన్నిసార్లు చర్మం చిట్లిపోవడం వంటివి జరుగుతుంటాయి. సాధారణంగా ప్రతి గర్భిణీలోనూ ఇలాంటివి ఎదుర్కొంటారని చెప్పుకొచ్చింది.

Advertisement

Kajal Aggarwal Baby Bump : నెటిజన్లకు ఇచ్చిపడేసిన కాజల్ అగర్వాల్.. సపోర్టుగా మహిళా లోకం..

Kajal Aggarwal Baby Bump : Samantha and Hansika support to Kajal Aggarwal On Baby Bump Body Shaming Trolls
Kajal Aggarwal Baby Bump : Samantha and Hansika support to Kajal Aggarwal On Baby Bump Body Shaming Trolls

కాజల్ పెట్టిన పోస్టుపై మహిళా లోకం స్పందించింది. సినీ హీరోయిన్లు కాజల్ కు సపోర్టుగా ముందుకు వస్తున్నారు. ముందుగా కాజల్ సోదరి నిషా అగర్వాల్ నుంచి నటి సమంత, మంచు లక్ష్మి, రాశీ కన్నా సహా పలువురు హీరోయిన్లు కాజల్ కు మద్దుతుగా నిలిచారు. కాజల్‌ను కూల్ చేస్తూ.. ‘నువ్వు ఎప్పుడూ అందంగానే ఉంటావ్’ కాజల్ అని సమంత చెప్పింది.

హన్సిక కూడా ‘నువ్వు అద్భుతంగా ఉంటావు కాజ్. ఏ కామెంట్లు వాటిని మార్చలేవు. నువ్వే కాదు, నీ మనసు కూడా చాలా అందమైనదే’ అని తెలిపింది. ఇక మంచు లక్ష్మి కూడా స్పందిస్తూ.. ‘ఎటు నుంచి చూసినా నువ్వు పర్‌ఫెక్ట్‌గా ఉంటావు. నీ చుట్టూ చాలా ప్రేమ ఉంది. హేటర్స్ ఎప్పుడూ హేటర్స్‌లాగేనే ఉంటారనేది గుర్తుంచుకో’’ అని తెలిపింది.

Read Also : AP Inter Exams Dates : ఏపీలో టెన్త్‌, ఇంటర్‌ పరీక్షల షెడ్యూల్‌ విడుదల.. ఏయే తేదీల్లో ఎప్పుడంటే?

Advertisement

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel