Bigg Boss 5 Telugu : షణ్ముక్‌కు షాకిచ్చిన సిరి తల్లి.. నా బిడ్డను నువ్వు అలా పట్టుకోవడం నాకు నచ్చలే..?

Updated on: November 26, 2021

Bigg Boss 5 Telugu : బిగ్‌బాస్ సీజన్ -5 బుల్లితెర ఎంటర్మైన్ మెంట్ రోజురోజుకూ చాలా ఆసక్తిగా సాగుతోంది. సభ్యులందరూ చాలా బాగా గేమ్ ఆడుతున్నారు. సీజన్ ప్రారంభంలో 19 మంది సభ్యులు హౌస్‌లోకి అడుగుపెట్టగా  ప్రస్తుతం 8 మంది సభ్యులు మాత్రమే మిగిలారు. ఇప్పటివరకు 12 ఎలిమినేషన్ రౌండ్స్ పూర్తయినట్టు బిగ్ బాస్ ప్రకటించారు. మరో మూడున్నర వారాల్లో బిగ్‌బాస్ షోకు ఎండ్ కార్డ్ పడనున్న విషయం తెలిసిందే.

ప్రతీ సీజన్‌లో బిగ్‌బాస్‌ హౌస్‌కు వచ్చిన సభ్యుల్లో కనీసం ఒక్క జంటైనా లవ్ ట్రాక్ నడపడం అందరికీ తెలుసు. ఇదంతా రేటింగ్స్ కోసం బిగ్ బాస్ ప్లాన్ చేస్తాడని కూడా టాక్ నడుస్తోంది. అయితే, ఈ సారి సిరి, షణ్ముక్ మధ్య లవ్ ట్రాక్ ఏమో కానీ ఏకంగా రొమాన్స్ నడుస్తోంది. చిటికీ మాటికీ సిరి వెళ్లి షన్నూను హగ్ చేసుకోవడం, ముద్దులు పెట్టుకోవడం, కలిసి ఒకే బెడ్ పై పడుకోవడం ఇలా నానా రచ్చ చేస్తున్నారు. వీరిద్దరి చేష్టలపై ఫ్యాన్స్ కూడా చాలా సందేహాలు వ్యక్తం చేస్తున్నారట.. వీరి మధ్య నిజంగానే లవ్ ఉందా..? అందుకే కంట్రోల్  తప్పుతున్నారా? అని అనుమానాుల వ్యక్తం అవుతున్నాయి.

ఈ క్రమంలోనే నామినేషన్ రౌండ్ దగ్గర పడుతున్న సమయంలో సభ్యులకు చెందిన ఫ్యామిలీ మెంబర్స్‌ను ఒక్కొక్కరిగా హౌస్‌లోకి రప్పిస్తు్న్నారు బిగ్ బాస్..మొన్న కాజల్ కూతురు, భర్త హౌస్‌లో ఎంట్రీ ఇవ్వగా..  తాజా ఎపిసోడ్‌లో  మానస్, సిరి తల్లులు హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చినట్టు ప్రోమో చూపించారు బిగ్‌బాస్.. మొదట మానస్ మదర్ రావడంతోనే శ్రీరామ్, కాజల్ పై పంచులు వేస్తూ నవ్వుతూ నవ్విస్తుంది. ఇక సిరి తల్లి రాగానే తన కూతురిని కౌలిగించకుంటుంది. అయితే, ఇక్కడే షణ్మక్‌కు కోలుకోలేని షాక్ ఇస్తుంది సిరి మదర్.. ‘నువ్వు నా కూతురిని ఇష్టం వచ్చినట్టు కౌగిలించుకోవడం తనకు నచ్చడం లేదని స్పష్టం చేసింది. దీంతో షన్నూ నోట్లో నుంచి కాసేపటి వరకు మాట రాలేదంటే ఒట్టు..

Advertisement

Read Also : Jr NTR Political Entry : బాబు కన్నీళ్లు తుడిచేందుకు.. రాజకీయాల్లోకి యంగ్ టైగర్ NTR..?

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel