Bigg Boss 5 Telugu : దీప్తి.. దీప్తి అని ‘షణ్ముక్’ అంతలా కలవరించింది ఇందుకా..? ఆ సైగలతో హింట్ ఇచ్చిందా?

Bigg Boss 5 Telugu : బుల్లితెర గేమ్ షో బిగ్‌బాస్ సీజన్ -5లో సభ్యులందరూ చాలా బాగా గేమ్ ఆడుతున్నారు. ప్రస్తుతం హౌస్‌లో ఎపిసోడ్ -84 కంప్లీట్ అవ్వగా, ఈ వారం ఎలిమినేషన్ రౌండ్ ఎవరూ ఊహించని విధంగా జరిగింది. అందరూ ఊహించిన విధంగా కాజల్ లేదా ప్రియాంక ఈ వారం నామినేషన్స్‌లో నిలుస్తారనుకుంటే బిగ్‌బాస్ ఏకంగా యాంకర్ రవిని ఎలిమినేషన్ చేస్తున్నట్టు ప్రకటించారు.అయితే, రవి ఫ్యాన్స్ మాత్రం టైటిల్ రేసులో ఉన్నాడని లేదా కనీసం టాప్ -5లో ఉంటాడని అంతా భావించారు.

అయితే, ఈ వారం చివరి మూడు రోజులు బిగ్‌బాస్ కంటెస్టెంట్స్‌కు చెందిన కుటుంబాలు, ఫ్రెండ్స్‌, లవర్స్‌ను హౌస్‌లోకి అనుమతించిన విషయం తెలిసిందే. మొదట కాజల్ భర్త, కూతురు.. ఆ తర్వాత సన్నీ, మాసన్ తల్లులు, రవి ఫ్యామిలీ, ప్రియాంక, శ్రీరామచంద్ర చెల్లెల్లు, ఇక సిరి, షణ్ముక్ తల్లులతో పాటు లవర్స్ కూడా హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. వీరు తమవారికి గేమ్ గురించి సలహాలు, సూచనలు ఇచ్చారు.

అయితే, షణ్ముక్ తన అమ్మగారు వచ్చినప్పుడు పదే పదే దీప్తి దీప్తి అని అడిగాడు. దీంతో వాళ్ల అమ్మగారు ఉమాదేవి తన కొడుకుపై ఫైర్ అయ్యింది. తీరా దీపు రావడంతో షన్నూ ఫుల్ ఖుషీ అయ్యాడు. అయితే, దీపు బోర్డులు పెట్టేటప్పుడు షన్నూకు తెగ సైగలు చేసింది. తన రెండు వేళ్లను నొక్కిపెట్టి తన లవర్‌‌కు ఏదో హింట్ ఇవ్వాలని చూసింది. కానీ ఎవరికీ అర్థం కాలేదు. కొంచెం క్లారిటీగా చూస్తే అర్థమైన విషయం ఎంటంటే షణ్ముక్ సభ్యులందరిలో సెకండ్ ప్లేస్‌లో కొనసాగుతున్నాడట.. ఆ విషయం చెప్పడానికే దీప్తి ట్రై చేసింది. హింట్స్ కోసమేనా షన్నూ.. దీపు దీపు అని కలవరించిందని నెటిజన్లు తెగ కామెంట్స్ చేస్తున్నారు.

Advertisement

Read Also :  Bigg Boss 5 Telugu : షణ్ముక్‌కు క్లాస్ పీకిన తల్లి.. అవి తగ్గించుకుంటే బెటర్ అంటూ..

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel