Anchor Anasuya: మగ జాతి పరువు తీయద్దంటూ నెటిజన్ కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన అనసూయ!

Anchor Anasuya: జబర్దస్త్ యాంకర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న అనసూయ రంగమ్మత్త పాత్రలో వెండితెరపై తళుక్కుమన్నారు.రంగస్థలం సినిమాలోని రంగమ్మత్త పాత్ర ద్వారా వెండి తెరపై మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈమె ఈ సినిమా తర్వాత వరుస సినిమాలతో దూసుకుపోతోంది. ఈ విధంగా కెరియర్ పరంగా ఎంతో బిజీ బిజీగా ఉన్న అనసూయ సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్గా ఉంటారు.ఈ క్రమంలోనే తనకు సంబంధించిన ప్రతి విషయాన్ని అభిమానులతో పంచుకోవడమే కాకుండా తన గ్లామరస్ ఫోటోలను కూడా అభిమానులతో పంచుకుంటారు.

ఈ క్రమంలోనే పొట్టి దుస్తులు ధరించి ఫోటోలకు ఫోజులు ఇస్తూ ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ, నెటిజన్ల నుంచి దారుణమైన ట్రోలింగ్ ను ఎదుర్కొంటూ ఉంటారు.అయితే తన గురించి ఎవరైనా నెగిటివ్ గా మాట్లాడిన నెగిటివ్ కామెంట్లు చేసిన అనసూయ చూస్తూ చూడనట్టు ఉండకుండా తనదైన శైలిలో వారికి లెఫ్ట్ రైట్ ఇస్తుంది. ఇలా ఎన్నో సార్లు జరిగినప్పటికీ తాజాగా మరోక నెటిజన్ అనసూయ వస్త్రధారణ పై కామెంట్ చేశారు.

ఈ సందర్భంగా సోషల్ మీడియా వేదికగా సదరు నెటిజన్ స్పందిస్తూ… ఇద్దరు పిల్లలకు తల్లి అయినా చిన్న పిల్లల మాదిరిగా ఆ పొట్టి పొట్టి దుస్తులు ధరించడం ఏంటి.. ఇలాంటి దుస్తులు ధరించి తెలుగు ఆడపడుచుల పరువు తీస్తున్నారు అంటూ కామెంట్ చేశారు.ఇక ఈ కామెంట్ చూసిన అనసూయ వెంటనే స్పందిస్తూ సదరు నెటిజెన్ కు తనదైన శైలిలో స్ట్రాంగ్ కౌంటర్ వేశారు. దయచేసి మీ పని మీరు చూసుకొని నా పని నన్ను చేసుకోనివ్వండి.. మీరు ఇలా ఆలోచిస్తూ మగజాతి పరువు తీయకండి అంటూ అనసూయ కౌంటర్ వేశారు. ప్రస్తుతం వీరిద్దరి సంభాషణలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Advertisement

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel