Peacock Pregnancy : నెమలి ఎంతో అందంగా ఉంటుంది. దానిని చూస్తే ఎంతో ముచ్చటేస్తుంది. నెమళ్లను ఎంత సేపు చూసినా అలాగే చూస్తూ ఉండాలి అనిపిస్తుంది. అయితే నెమళ్లలో చాలా అందంగా కనిపించేది.. ఈకలను పురివిప్పి నాట్యమాడేది ఆడ నెమలి అని చాలా మంది అనుకుంటారు. మిగతా ప్రాణుల్లో ఆడవి ఎక్కువగా అందంగా ఉంటాయి. కానీ నెమళ్లు, సింహాల్లో మగవి చాలా అందంగా ఉంటాయి. ముఖ్యంగా నెమలి అనగానే ఎక్కువ మందికి గుర్తుకు వచ్చేది మగ నెమలి మాత్రమే. దాని అందం, దాని సొగసు ఎవరినైనా కట్టిపడేస్తుంది. ఆడ నెమళ్లను ఆకర్షించడానికే మగ నెమళ్లు చాలా
అందంగా కనిపిస్తాయి. వాటి పొడవాటి ఈకలు, డ్యాన్స్ తో ఆడవాటిని ఆకర్షించి వాటితో సంభోగిస్తాయి.
పురాణాల్లోనూ నెమలి ప్రస్తావన చాలా చోట్ల ఉంది. కృష్ణుడు ఎప్పుడూ నెమలి పించాన్ని తలపై ధరిస్తాడు. దీనికి కూడా ఓ కారణాన్ని చెబుతారు పండితులు. నెమని సంభోగించకుండానే పిల్లల్ని కంటుందని అంటారు. మగ నెమలి పరవశించి పోయి నాట్యం చేస్తున్నప్పుడు దాని కళ్ల నుండి వచ్చే కన్నీటిని తాగడం ద్వారా నెమల ఆడ నెమళ్లు గర్భం ధరిస్తాయని చెబుతారు. అలా సంభోగంలో పాల్గొనకుండానే నెమళ్లు గర్బం దాల్చుతాయని అంటారు. అందుకే కృష్ణుడు ఎంత మంది గోపికలతో తిరిగినా ఆయన ఎప్పటికీ బ్రహ్మచారి అని అంటారు. కానీ ఇందులో ఏమాత్రం వాస్తవం లేదని అంటారు జీవ శాస్త్రజ్ఞులు. కలయిక ద్వారానే గర్భం వస్తుందని వారు చెబుతున్నారు. మగ నెమలి పురివిప్పి నాట్యం చేస్తూ ఆడ నెమలిని ఆకర్షిస్తుంది. అలా రెండూ జత కడతాయి. ఈ కలవడం ద్వారా మాత్రం గర్భం ధరిస్తాయని.. కన్నీటి తాగడం వల్ల గర్భం వస్తుందన్నది కేవలం అపోహ మాత్రమేనని చెబుతున్నారు శాస్త్రవేత్తలు.
Read Also : Peacock Feathers: ఇంట్లో నెమలి ఈక ను ఏ దిశలో పెట్టడం వల్ల అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి.