ITR Filing 2025 : పన్ను చెల్లింపుదారులకు బిగ్ అలర్ట్.. ఆదాయపు పన్ను రిటర్న్ (ITR) దాఖలు చేసేందుకు చివరి తేదీ సెప్టెంబర్ 15. ఈసారి 1.65 లక్షల కేసులు పరిశీలనలోకి వచ్చాయి. అంటే ఐటీఆర్ ఫైలింగ్‌లో ఏదైనా తప్పు జరిగితే ఐటీ నోటీసులు ఇవ్వడం ఖాయం.
రిటర్న్ దాఖలు చేయడం మాత్రమే సరిపోదు. సరైన సమాచారం ఇవ్వడం కూడా ముఖ్యం. ఐటీఆర్ ఫైలింగ్ సమయంలో చేసే ఈ 8 మిస్టేక్స్ ఏ విధంగా మిమ్మల్ని ఇబ్బందుల్లో పడేస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం.
ఆదాయపు పన్ను రిటర్న్ (ITR) దాఖలు చేసేందుకు చివరి తేదీ సెప్టెంబర్ 15 దగ్గర పడుతోంది. గడువు దగ్గర పడింది. ఈ తప్పు అసలు చేయకండి. ఐటీఆర్ దాఖలు చేయడానికి చివరి తేదీ సెప్టెంబర్ 15, 2025. ఈసారి 1.65 లక్షల కేసులు పరిశీలనకు వెళ్లాయి. అంటే కేవలం రిటర్న్ దాఖలు చేయడం సరిపోదని గమనించాలి.
ITR Filing 2025 : TDS, ఆదాయం మధ్య మిస్ మ్యాచింగ్ :
ఫారమ్ 26AS లేదా AISలో చూపిన TDS మీ ప్రకటించిన ఆదాయంతో సరిపోలకపోతే మీకు ఐటీ నోటీసులు రావచ్చు. ఈ తప్పు తరచుగా జీతం పొందే వ్యక్తులు, ఫ్రీలాన్సర్లు చేస్తారు.
ITR Filing 2025 : తప్పుడు డిడెక్షన్లను క్లెయిమ్ చేయడం :
సెక్షన్ 80C, 80D లేదా HRA కింద తప్పుడు లేదా అధిక క్లెయిమ్‌లు గందరగోళానికి దారితీయవచ్చు. తప్పుడు డాక్యుమెంట్లపై 50శాతం వరకు జరిమానా లేదా 200శాతం వరకు జరిమానా విధించవచ్చు.
హై వాల్యూ పేమెంట్లను దాచడం :
- రూ. 10 లక్షలకు పైగా క్యాష్ డిపాజిట్లు,
- రూ. 2 లక్షలకు పైగా క్రెడిట్ కార్డ్ పేమెంట్లు
- రూ. లక్షకు పైగా షేర్ పెట్టుబడులు ఇవన్నీ ఐటీఆర్‌లో చూపించాల్సి ఉంటుంది.
ఆదాయంలో ఆకస్మిక తగ్గుదల :
మీ ఆదాయం అకస్మాత్తుగా తగ్గినట్లయితే ఐటీ శాఖ ప్రశ్నలు అడగవచ్చు. అలాంటి సందర్భంలో శాలరీ స్లిప్ లేదా ఉద్యోగ కోల్పోయినట్టు చూపించే లెటర్ వంటి డాక్యుమెంట్లు అవసరం అవుతాయి.
జాబ్ మారినట్టు చెప్పకపోవడం :
రెండు కంపెనీల నుంచి వచ్చే ఆదాయాన్ని సరిగ్గా లెక్కించకపోతే గందరగోళం ఏర్పడుతుంది. రెండు చోట్ల నుంచి డిడెక్షన్లను క్లెయిమ్ చేయడం పెద్ద సమస్యగా మారవచ్చు.
ఫేక్ ఎంట్రీలు, హైడ్ అకౌంట్లు :
ఫేక్ ఎంట్రీలు, బ్యాంకు అకౌంట్లు దాచడం లేదా ఫేక్ డాక్యుమెంట్లతో పట్టుబడితే కఠినమైన శిక్ష. సెక్షన్ 271AAD భారీ జరిమానాలను చెల్లించాల్సి ఉంటుంది.
రాంగ్ ITR ఫారమ్‌ను ఎంచుకుంటే :
ఆదాయాన్ని తక్కువగా నివేదించడం లేదా తప్పుగా నివేదించడం చేస్తే ఫలితంగా ఐటీ నోటీసు, జరిమానా రెండూ ఉంటాయి.
ITR Filing 2025 : మీకు ఐటీ నోటీసు అందితే ఏం చేయాలి? :
- ముందుగా నోటీసు నిజమైనదా లేదా కాదా? DIN నంబర్ ఉందా లేదా ఓసారి చెక్ చేయండి.
- నోటీసు ఏ సెక్షన్ కింద వచ్చిందో 139(9) లేదా 143(2) అర్థం చేసుకోండి.
- అన్ని డాక్యుమెంట్లను రెడీగా ఉంచుకోండి.
- అవసరమైతే, పన్ను నిపుణుడి సాయం తీసుకోండి.
- సమయానికి స్పందించడం చాలా ముఖ్యం.